దశరథ రాముడు (Dasharatha Ramudu).. కోదండ రాముడు (Kodanda Ramudu).. జానకీ రాముడు (Janakee Ramudu).. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మహాకావ్యం 'శ్రీరామాయణం' (Ramayanam). ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది.

దశరథ రాముడు (Dasharatha Ramudu).. కోదండ రాముడు (Kodanda Ramudu).. జానకీ రాముడు (Janakee Ramudu).. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మహాకావ్యం 'శ్రీరామాయణం' (Ramayanam). ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు 'పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి' అని తెలిపాడు. మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు.. మానవుడిగా పెరిగాడు.. మానవుడు పడ్డ కష్టాలను పడ్డాడు. మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యంతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషలతో గురువులను, దాన గుణముతో దీనులను గెలిచాడు. అలాగే, తన పౌరుష పరాక్రమములతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం.

కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః | విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ॥

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః | కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥

ధర్మం తప్పకుండ మనిషిఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. రాముడు పుష్కలంగా 16 గుణాలు కలిగి ఉన్నవాడు... అవేంటో చూద్దాం..!

1. గుణవంతుడు 2. వీర్యవంతుడు 3. ధర్మాత్ముడు 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు 9. విద్యావంతుడు, 10. సమర్థుడు 11. సౌందర్యము కలిగినవాడు 12. ధైర్యవంతుడు 13. క్రోధాన్ని జయించినవాడు 14. తేజస్సు కలిగినవాడు 15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు

Updated On 21 Jan 2024 11:58 PM GMT
Ehatv

Ehatv

Next Story