గంట మ్రోగించడం ద్వారా వెలువడే శబ్దం మంగళకరమైన ధ్వనిగా పరిగణించబడుతుంది. ఇది విశ్వానికంతా భగవన్నామమైన ‘ఓంకార’ నాదాన్ని ఉద్భవింపజేస్తుంది. సదా శుభప్రదమైన భగవంతుని దర్శనం పొందడానికి గంట మ్రోగిస్తాం. గంటను కొడితే “ఓం” అనే స్వరం వినిపిస్తుందని పురాణల్లో చెప్పబడింది. ‘హారతి’ ఇచ్చే సమయంలో కూడా గంట మోగిస్తారు.

మన క్షేత్రాలలో దేవాలయానికి వెళ్లిన ప్రతీ భక్తుడు గుడిలో ఉన్న గంటను ఎందుకు మోగిస్తారో ఎవరికీ తెలియదు. సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వేలాడ దీయబడి ఉంటాయి. భక్తులు ఆలయంలోకి వెళ్లగానే
గంట మోగించి.. ఆ తర్వాతనే భగవంతుడిని దర్శనం చేసుకొని ధ్యానించుకుంటారు.అయితే గంటను ఎందుకు కొడుతున్నారో ఎవరికీ తెలియదు, ఏదో గుడిలో గంట వుంది కదా అని అలా మోగించి వెళ్లిపోతారే తప్ప, దాని వెనకాల వుండే పరమార్థం మాత్రం తెలియదు. అలాంటప్పుడు గంట ఎందుకు మోగిస్తామో తెలుసుకుందామా..

గంట మ్రోగించడం ద్వారా వెలువడే శబ్దం మంగళకరమైన ధ్వనిగా పరిగణించబడుతుంది. ఇది విశ్వానికంతా భగవన్నామమైన ‘ఓంకార’ నాదాన్ని ఉద్భవింపజేస్తుంది. సదా శుభప్రదమైన భగవంతుని దర్శనం పొందడానికి గంట మ్రోగిస్తాం. గంటను కొడితే “ఓం” అనే స్వరం వినిపిస్తుందని పురాణల్లో చెప్పబడింది. ‘హారతి’ ఇచ్చే సమయంలో కూడా గంట మోగిస్తారు. ఇది కొన్ని సమయాలలో మంగళకరమైన శంఖారావములతోపాటు మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతోనూ కూడి ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. భక్తుల ఏకాగ్రత, అంతర్గత అశాంతి, అమంగళ, అసంగతమైన శబ్దాల నుంచి బయట పడడానికి గంట శబ్దం సహాయపడుతుందని చెప్తున్నారు.

మన పురాణ గ్రంథాల్లో చెప్పబడిన విధంగా గంటలో ఉండే ప్రతీ భాగానికి ఓ ప్రత్యేకత ఉంది. గంట నాలుకలో సర్వస్వతీ దేవి,
ముఖభాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రడు, కొన భాగంలో వాసుకీ దేవుడు, పిడిభాగంలో గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో ఉంటాయని ఇతిహాసంలో చెప్పబడ్డాయి.

దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికే హారతి సమయంలో గంట కొడతారని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల్లో చెప్పబడిన విధంగా గుడిలో హారతి ఇస్తున్న సమయంలో ప్రతిష్టించ బడిన దేవుడితో పాటు మిగతా దేవుళ్లకు కూడా హారతి ఇస్తూ ప్రతిష్టించబడిన విగ్రహాన్ని ఆ వెలుగులో పూజారి చూపిస్తుంటారు. అందుకే గుడిలో ఉండే పూజారి హారతి ఇచ్చే టైంలో భక్తులు ఎవరూ మాట్లాడకుండా, కళ్లుమూసుకోకుండా దేవుడిని మనస్సులో తలచుకోవాలని చెబుతారు.

సాధారణంగా దేవాలయాల్లో కంచు, ఇత్తడి, పంచలోహాలతో చేసిన గంటలు వాడుతుంటారు. కంచుతో తయారు చేసిన గంటను
కొడితే “ఓం” అనే స్వరం వినిపిస్తుందని పురాణల్లో చెప్పబడ్డాయి. కొన్ని దేవాలయాల్లో గంటలను గుత్తులు, గుత్తులుగా ఒకే తాడుకి కట్టి తగిలిస్తారు. అనుకున్న పని త్వరగా నెరవేరుతుందని భక్తుల యొక్క మూడ విశ్వాసం.

పూజ ప్రారంభంలో ఇలా చెబుతూ గంటను మ్రోగించాలంటున్నారు.

'ఆగమార్ధంతు దేవానాం'... 'గమనార్ధంతు రక్షసాం'.. 'కురుఘంటా రవం'.. 'తత్ర దేవతాహ్వాన లాంఛనం'.. అంటే దీని అర్థం దైవాన్ని ప్రార్ధిస్తూ నేను ఈ ఘంటారావం చేస్తున్నాను. దాని వలన సద్గుణ దైవీపరమైన శక్తులు నాలో ప్రవేశించి నా గృహము, హృదయము నుంచి అసురీ మరియు దుష్టపరమైన శక్తులు వైదొలగుగాక అని.. నాకు కలిగే నరపీడ దోషాలను హరించాలని మనసులో అనుకొని గంటను మ్రోగించాలట.

Updated On 7 Dec 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story