మన పంచాంగం అనుసరించి ప్రతి నెల కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఏటా వచ్చే పన్నెండు అమావాస్య తిథులలో చొల్లంగి అమావాస్య(Chollangi Amavasya)కు ప్రత్యేకత ఉంది. ఈ పవిత్రమైన రోజున జపం, దానం, పూజలు చేయడం, మౌనవ్రతం వంటివి పాటిస్తారు. పుష్య కృష్ణ అమావాస్య(Pushya Amavasya)ను చొల్లంగి అమావాస్య అంటారు.
మన పంచాంగం అనుసరించి ప్రతి నెల కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఏటా వచ్చే పన్నెండు అమావాస్య తిథులలో చొల్లంగి అమావాస్య(Chollangi Amavasya)కు ప్రత్యేకత ఉంది. ఈ పవిత్రమైన రోజున జపం, దానం, పూజలు చేయడం, మౌనవ్రతం వంటివి పాటిస్తారు. పుష్య కృష్ణ అమావాస్య(Pushya Amavasya)ను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డుమీద మూడు మైళ్ళ దూరంలో చొల్లంగి అనే గ్రామం ఉంది. గోదావరి ఏడు పాయలలో ఒకటైన తుల్యభాగ ఇక్కడే సముద్రంలో కలుస్తుంది. గౌతముడు తీసుకొచ్చిన గోదావరి జలాలను ఏడుగురు ఋషులు ఏడు పాయలుగా తీసుకొని పోయి ఏడు స్థలాలలో సంగిమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితయై గోదావరి యగ్రము వద్ద మాసాని తిప్ప చోట సముద్రంలో కలుస్తున్నది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వసిష్ఠుడు ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖలు వారివారి పేర్లతో పరమగుతున్నాయి. తుల్యుడు కొనిపోయిన శాఖ చొల్లంగి చెంత, ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన, భరద్వాజ భైరవపాలెం/తీర్థాల మొండి దగ్గర, కౌశిక నత్తల నడక సమీపాన, జమదగ్ని కుండలేశ్వరం వద్ద,వశిష్ఠ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి. కాబట్టి ఏడు స్థలాలకు వెళ్లి స్నానాలు ఆచరించి రావడాన్ని సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర లేదా సప్త సాగర యాత్ర అంటారు. సంతానం, తదితర కోరికలు ఈడేరడానికి సప్తసాగర యాత్ర చేయడం సంప్రదాయ సిద్ధంగా వస్తున్నది. సప్త సాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభం అవుతుంది. ఏడు తావులు చూసుకుని, ప్రాయకంగా మాఘ శుక్ల ఏకాదశి నాటికి వశిష్టా సాగర సంగమ స్థానమైన అంతర్వేది చేరతారు. ఆ దినం అక్కడ గొప్ప తీర్థం. ఆ ఏకాదశిని ఆ ప్రాంతంలో అంతర్వేది ఏకాదశి అని పిలవడం పరిపాటి.