కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ లడ్డూ(laddu)ప్రసాదాన్ని పది మందికి పంచి పుణ్యం మూటగట్టుకుంటారు. తిరుపతి లడ్డూకు ఓ విశిష్టత ఉంది. ఓ ప్రత్యేకత ఉంది. ఇలాంటి లడ్డూ మరెక్కడా దొరకదు. ఇంతటి రుచి మరెక్కడా రాదు! తిరుమలలో ప్రతి రోజూ సుమారు మూడు లక్షల లడ్లు తయారవుతుంటాయి. ఇంతకు ముందు కట్టెల పొయ్యి మీద లడ్డూలను తయారుచేసేశారు ఇప్పుడు ఆవిరి పొయ్యులను వాడుతున్నారు. దాదాపు 48 పొయ్యిలు ఉంటాయి. ఏడు వందల(7 hundred)మంది ఈ పనిలోనే ఉంటారు. ప్రస్తుతం మూడు రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు:
ఆస్థాన లడ్డు
ఆస్థాన లడ్డులను ప్రత్యేక సందర్భాలలోనే తయారు చేస్తారు. అత్యంత ప్రముఖులకు మాత్రమే అందచేస్తారు. సాధారణంగా ఈ లడ్డూల విక్రయం జరగదు. వీటి తయారీలో, అధిక మొత్తంలో నెయ్యి మరియు సారపప్పు వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు. దీని బరువు సుమారుగా 750 గ్రాములు(750 grams)ఉంటుంది. దీని రుచి మాత్రం అమోఘం. మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే జన్మ ధన్యమైనట్టే!
కళ్యాణోత్సవ లడ్డు
కళ్యాణోత్సవ లడ్డును కళ్యాణోత్సవ ఆర్జితసేవలో(Arjitha Sevas)పాల్గొన్న గృహస్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ లడ్డు కూడా దాదాపు 700 గ్రాముల(700 grams)బరువుంటుంది. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతర సేవలలో పాల్గొన్న భక్తులు. ఈ లడ్డూలను - దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో గల వగపడి నుంచి తీసుకుంటారు. ఇప్పుడు కౌంటర్ లో కూడా ఈ లడ్డూలను విక్రయిస్తున్నారు. ఒక్కో లడ్డుకు 200 రూపాయలు(200 hundred rupees)చార్జ్ చేస్తున్నారు.
సాధారణ లడ్డు
సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ లడ్డూలను ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జితసేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారు 175 గ్రాములు(175 Grams) ఉంటుంది. దీని ధర ఒకటి 50 రూపాయలు(50 rupees).ఈ లడ్డూనే మన అందరికి తెలిసిన లడ్డు! భక్తులకు దర్శనం తర్వాత ఉచిత ప్రసాదంగా చిన్న చిన్న లడ్డూలను కూడా అందజేస్తున్నారు.