ఇంటింటా కళ్లు మిరుమిట్లుగొలిపే దీపకాంతుల వరుసలు. వాడవాడలా దిక్కులదిరే బాణాసంచా చప్పుళ్లు. ఆకాశమంతా అల్లుకున్న విద్యుల్లతలు. చిక్కటి చీకటిలో అతి చక్కటి జాబిల్లిలా అంతటా వెలుగులే! అందరి మోముల్లోనూ ఆనందపు జిలుగులే! దీపావళి పండుగ ప్రత్యేకత ఇది! జాతీయ పండుగలైన పంద్రాగస్టు, రిపబ్లిక్‌ డేల తర్వాత దాదాపుగా జాతి మొత్తం జరుపుకునే పండుగ ఇది! ఆ దీప మహోత్సవపు ఘనతలను తెలుసుకుందాం!

ఇంటింటా కళ్లు మిరుమిట్లుగొలిపే దీపకాంతుల వరుసలు. వాడవాడలా దిక్కులదిరే బాణాసంచా చప్పుళ్లు. ఆకాశమంతా అల్లుకున్న విద్యుల్లతలు. చిక్కటి చీకటిలో అతి చక్కటి జాబిల్లిలా అంతటా వెలుగులే! అందరి మోముల్లోనూ ఆనందపు జిలుగులే! దీపావళి పండుగ ప్రత్యేకత ఇది! జాతీయ పండుగలైన పంద్రాగస్టు, రిపబ్లిక్‌ డేల తర్వాత దాదాపుగా జాతి మొత్తం జరుపుకునే పండుగ ఇది! ఆ దీప మహోత్సవపు ఘనతలను తెలుసుకుందాం!

చీకటి అజ్ఞానానికి సంకేతం. వెలుగు జ్ఞానానికి చిహ్నం.దీపం(Light) చిన్నదైనా చుట్టుపక్కంతా వెలుగును నింపుతుంది.అది కళ్లకు మాత్రమే కనిపించే కాంతి కాదు. మనసును నింపే జ్ఞానకాంతి. దీపావళి(Diwali) అంటే దీపాల వరుస.మనలో వున్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానకాంతులను విరజిమ్మే పండుగ. దేశమంతా ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ. చిమ్మ చీకట్లను కురిపించే అమావాస్య(Amavasya) రాత్రిని పిండారబోసినట్లనిపించే వెన్నెల వెలుతుళ్లతో నింపేసే పండుగ. కుల మతాలు, వయో భేదాలుండవు. అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ.అది నవ్యకాంతుల నేత్రావళి. దివ్య జ్యోతుల దీపావళి.
దీపావళి వెనుక ఎన్ని పురాణగాధలు ఉన్నా ఆ పండుగ వెనుక పరమార్థం మాత్రం చీటికి తరిమికొట్టడమే! దక్షిణ భారతంలో(south India) ఈ పర్వదినం మూడు రోజుల పాటు జరుగుతుంది. అశ్వీయుజ బహుళ చతుర్ధశి.

దీన్నే నరక చతుర్ధశి(Naraka Chaturdashi) అంటారు. తర్వాతి రోజు అమావాస్య. అదే దీపావళి.ఆ మరుసటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి(Kartika Suddha Padyami). అదే ఉత్తరభారతదేశంలో అయితే అయిదు రోజుల పాటు జరుగుతుంది.అశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి మొదలయ్యే పండుగ సందడి విదియ వరకు కొనసాగుతుంది. ధన త్రయోదశి. నరక చతుర్ధశి. దీపావళి. బలిపాడ్యమి. భగినీహస్త భోజనం అన్న పేర్లతో ఉత్తరాదివారు పండుగ వేడుకలను జరుపుకుంటారు. త్రయోదశి రోజు సాంధ్య సమయాన అపమృత్యు నివారణ కోసం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దాన్ని పూజించి ఇంటి ముందు ఉంచుతారు.

దీన్ని యమద్వీపం అని కూడా అంటారు. చతుర్ధశి. అమావాస్య రోజుల్లో ప్రదోష వేళ దీపదానాన్ని చేస్తారు. తద్వారా యమ మార్గాధికారం నుంచి బయటపడతారు. ఈ దీపోత్సవాన్ని కౌముదీ మహోత్సవం అని అంటారు. నరక చతుర్ధశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి దీపదానం చేస్తే పుణ్యలోకాలు సంప్రాప్తమవుతాయట!
నరక చతుర్ధశి రోజున నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి(Ganga devi) ఉంటారు. అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానమాచరించి, కొత్త వస్త్రాలు ధరించి ఉత్తరేణి ఆకులు, మట్టిపెళ్లలతో దిష్టి తీయించుకుంటారు. దీపావళి రోజున మర్రి, మామిడి, అత్తి, జవ్వి , నేరేడు చెట్ల బెరడులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయడం కూడా ఓ ఆచారం.

ప్రదోష కాలాల్లో దీపాలను వెలిగించి.. ఆ తర్వాత దరిద్రాన్ని పారదోలేందుకు, ధన కనక వస్తు వాహనాలు లభించేందుకు లక్ష్మీపూజ చేస్తారు. ఆ తర్వాత బాణాసంచా కాలుస్తారు. కొందరు పితృదేవతారాధన కూడా చేస్తారు. మార్వాడీలకు, గుజరాతీలకు, నేపాలీలకు దీపావళితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఆ ప్రాంతాల్లోని వ్యాపార వర్గాల వారు దీపావళి రోజు నుంచే తమ తమ వ్యాపారాలకు చెందిన జమా ఖర్చుల లెక్కలకు సంబంధించిన కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు.
మణిమయరత్న భూషణాలను దానంగా ఇచ్చే వాళ్లు చాలా మందే ఉన్నారు.. రాజ్యాలకు రాజ్యాలు దానమిచ్చినవాళ్లూ ఉన్నారు. కానీ తనకు తాను అర్పణం చేసుకున్న మహనీయుడు ఒక్కరే ఉన్నారు. ఆయనే బలి చక్రవర్తి(Bali Chakravarti).

ఐశ్వర్యమూర్తి మహాలక్ష్మీదేవి అంగాంగాలను ఆ చేతులు తడిమాయనీ, అంతటి చేతులు తన చేతి కిందకు చేరితే అంతకు మించి ఏం కావాలనుకున్నాడు బలి. వామనావతారంలో వచ్చినవాడు మహా విష్ణువని తెలిసీ ఆ లక్ష్మీపతికి తనకు తాను దానమిచ్చుకుంటాడు. బలి దాన నిరతికి మెచ్చిన ఆ నారాయణుడు వరమొకటి ఇస్తాడు. ఏడాదికోసారి అంటే కార్తీక పాడ్యమినాడు పాతాళం నుంచి వచ్చి భూమిని పాలించుకోవచ్చంటాడు శ్రీహరి. అందుకే ఇది బలిపాడ్యమి అయ్యింది.
అఖరుగా ఓ వింత పండుగ జరుపుకుంటారు. ఇది రాఖీ పండుగను తలపిస్తుంది. దీనిని భ్రాతృ ద్వితీయ లేక యమ ద్వితీయ అంటారు.ఆ రోజున అన్నదమ్ములు అక్క చెళ్లిళ్ల ఇళ్లకు వెళ్లి వాళ్లు చేసిన వంటకాలను కడుపారా ఆరగిస్తారు.అందుకే దీన్ని భాగినీ హస్త భోజనం అంటారు. అంటే తోబుట్టువు చేతి వంట తినే రోజున్నమాట. ఆ వంట నోరారా హాయిగా తిని చేతులారా అక్కచెల్లెళ్లకు కానుకలిచ్చి వస్తారు అన్నదమ్ములు.

Updated On 10 Nov 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story