సంప్రదాయంగా మనం అనుసరించే మాసాల్లో ధనుర్మాసం ఒకటి. ఇది దక్షిణాయనానికి చివరిలోనూ, ఉత్తరాయణానికి ప్రారంభంలోనూ వచ్చే పవిత్రమాసం.

సంప్రదాయంగా మనం అనుసరించే మాసాల్లో ధనుర్మాసం ఒకటి. ఇది దక్షిణాయనానికి చివరిలోనూ, ఉత్తరాయణానికి ప్రారంభంలోనూ వచ్చే పవిత్రమాసం. దైవాన్ని అర్చించుకునే అనువైన మాసంగా ధనుర్మాసానికి పేరుంది. మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం ఇది. తెలుగునాట సాంస్కృతిక వికాసంలో ధనుర్మాసానికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. మాసం ప్రారంభరోజు నుంచి చివరి రోజు వరకూ ఇంటిముందు కళ్లాపులు, రంగవల్లులు, గొబ్బెమ్మలతో మహిళలు, కన్నెపిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు.

ధనుర్మాసం ఉభయసంధ్యల్లోనూ 'ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల దరిద్రం తొలగి మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ నెల రోజులపాటూ వైష్ణవాలయాల్లో ఉదయం పూట అర్చన. తరువాత స్వామికి నివేదించే ప్రసాదాన్ని విశేషించి చిన్న పిల్లలకు పెడుతుంటారు. దీనికే బాలభోగం అని జనవ్యవహారంలో పేరుంది. ద్రవిడ సంప్రదాయాన్ని అనుసరించి ధనుర్మాసంలో ప్రతీరోజూ 'ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం చేస్తారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం జరిగే సుప్రభాత '' పఠనానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. అలాగే స్వామికి చేసే సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలను వాడుతుంటారు. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినది మొదలు భోగి పండుగ దాకా వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని చేస్తారు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి శ్రీకృష్ణభగవానుణ్ణి అర్చించింది.

అవ్యక్తంగా ఉండే దైవం వ్యక్తరూపంలో కనుపించేది ప్రకృతిలోనే కదా! అందువలన శోభాయమానంగా కనిపించే ప్రకృతిలో ఈశ్వరుడు విశేషంగా ప్రకటిత నవుతాడు. ఎక్కడ భగవదారాధనలో సహజ రమణీయమైన ప్రకృతిశోభ ఇనుమడిస్తుందో అక్కడ దైవత్వం తొణికిసలాడుతుంది. తృప్తిగా, సంతోషంగా ఉండే మనసులోని ఆనందం పరమానందమవుతుంది. కాలగమనంలోని ఒక అందమైన మజిలీ ధనుర్మాసం.

అసలు ధనుర్మాసం అంటే సూర్యుడు ధనూరాశిలో ఉన్న మాసం. తర్వాత ఆదిత్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మకర సంక్ర మణంలో వచ్చే పెద్ద పండుగ మకర సంక్రాంతి. సంక్రాంతి శోభ అత్యంత మనోహరం. నిత్యం తన ప్రకాశంతో లోకాన్ని ప్రకా శింపచేసే భానుడు మరింత తేజోవంతంగా దర్శనమిచ్చేకాలమది. సంక్రాంతికి వెనుకవున్న ముప్ఫైరోజులను ధనుర్మాసమంటారు. మార్గశిర మాసంలో సూర్యుడు ధనూరాశిలో ఉన్నప్పుడు ధనుస్సుపట్టడం అంటారు. ఈ ధనుస్సంక్రమణం షడశీతి పుణ్యకాలం. మిధున కన్యా ధనుర్మాః రాశు లలోని సూర్యసంక్రాతిని షడశీతి అంటారని నిఘంటువు చెబుతోంది.

సామాన్యంగా పెద్దలు చెప్పేది మంచు విపరీతంగా మార్గశిరమాసంలో కురుస్తుంది. కాబట్టే, దాన్ని హేమంతఋతువు అన్నారు. ఆ ఋతువులో మనుష్యులు మంచుకు తడిసి, చలికి గడగడ వణుకుతూ వీపు విల్లులాగా వంగిపోగా ఒక మూల ముడుచుకొని పడుకొంటారు. సోమరులై, నిద్రపోతుంటారు. అలాంటివారు. తెల్లవారు జామున నిద్రలేచి, స్నానంచేసి, విష్ణుదేవాలయానికి వెళ్లాలనే సంకల్పం కల్గి ఉండడం సాధ్యమా? అందుకే, విల్లులా వంగిపోయిన మానవునివార్ధక్యదశకు సంకేత నామమే 'ధనుర్మాసం' అంటారు పెద్దలు. జ్యోతిశ్శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించేమాసం ధను ర్మాసం. దీన్నే ధనుస్సంక్రమణం

Updated On 15 Dec 2024 11:21 AM GMT
ehatv

ehatv

Next Story