మన దేశంలో సంస్కృతి సంప్రదాయాలతో పాటు నమ్మకాలు కూడా ఎక్కువే. ఒక్కోసారి ప్రజలు తాము అనుకున్న పనులు కావటానికి మూఢనమ్మకాలని కూడా ఫాలో అవుతుంటారు . దేశంలో చాలామంది సంతానం లేక ఎంతో మంది దంపతులు భాధపడుతుంటారు . వారు ఎన్నో మందులు హాస్పిటల్స్ వెనుక తిరిగి తిరిగి విసుగు చెంది చివరకు చేసేది ఏమి లేక గుళ్లో దేవుడికి మొక్కుతారు . కష్టాలు తీర్చేది దేవుడే కాబట్టి .. ఇలా సంతానం కోసం ఎవరైతే నిరాశతో ఉన్నారో అటువంటి వారు ఈ గుడికి వెళ్లి దొంగతనం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని అంటున్నారు అక్కడ స్థానికులు .

ఈ వింతాచారం ఉన్న గుడి రూర్కి జిల్లాలోని (Roorki dist)చుడియాల(Chudiyala) గ్రామంలో ఉన్న ఈ గుడి ఉత్తరాఖాండ్ (Uttarakhand)లోని పాపులర్ గుడులలో ఒకటని చెప్పవచ్చు.ఇక్కడ ఉన్న చూడామణి అమ్మవారి ఆలయంను (chudamani Temple)దర్శించుకుంటే కోరిన ప్రతి కోరిక తప్పకుండా నెరవేరడంతో పాటు సంతాన యోగం కలుగుతుంది అని నమ్మకం. చాల మంది దంపతులు ఇక్కడకు వచ్చి పిల్లల కోసం మొక్కుకుంటారట . వచ్చిన ప్రతి ఒక్కరు సంతానాన్ని పొందుతారట .అంతేకాదు ఈ గుడిలో అమ్మవారు మనం మంచి సంకల్పంతో ఏమి కోరుకున్న తప్పకుండా నెరవేరుస్తుందట
ఈ ఆలయంలో ఒక వింత ఆచారం ఉంది. ఇక్కడ గుడిలో ఎవరైనా చెక్క బొమ్మను దొంగతనం చేయాలి . ఆలా దొంగతనం చేసి అలాంటి బొమ్మని మరొకటి చేయించి తిరిగి ఆ రెండు బొమ్మలను గుడిలో ఇవ్వాలట .ఈ నమ్మకాన్ని పాటించిన వారు ఎవరికైనా మగ పిల్లలు పుడతారట .ఇలా ఇక్కడ దొంగతనం చేసిన వందలాది భక్తులకి మగపిల్లలు సంతానంగా కలిగారట . ఎవరైతే మగపిల్లలు కావాలి అనుకుంటారో వారు ఈ గుడిలో ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు అని అక్కడ స్థానికులు తెలపటం జరిగింది .