భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ తీర్థయాత్రలలోఉత్తరాఖండ్(Uttarakhand)యొక్క చార్ ధామ్(Char Dham) యాత్ర ఒకటి . బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి ఇంకా యమునోత్రి అంటూ ఈ నాలుగు పవిత్ర ప్రదేశాలను ఈ యాత్రలో సందర్శిస్తారు . ప్రతి ప్రదేశానికి ఒక్కో పురాణ చరిత్ర ఉంది. అత్యంత సాహసోపేతమైన ఈ యాత్రకు కాలినడకన ,కొండలమార్గం ద్వారా ,లోతైన ప్రదేశాల మీదుగా దాదాపు 10 రోజుల పాటు 1200 కిలో మీటర్ల వరకు ప్రయాణాన్ని చేయాల్సి ఉంటుంది . ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ )రోజు నుండి దీపావళి వరకు 6నెలల పాటు తెరిచి ఉండే ఈ ఆలయాలకు భక్తులు తాకిడి విపరీతంగా ఉంటుంది . మిగిలిన ఆరునెలలు ఈ ఆలయాలు మంచుతో కప్పబడి ఉంటాయి . ప్రకృతి ప్రతికూలతలవల్ల ఒక్కోసారి యాత్రికులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు .అయినా కూడా ఏటా చార్ ధామ్ (Char Dham) వెళ్లే యాత్రికుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గటం లేదు . చార్ ధామ్ యాత్ర మొదట యమునోత్రి నుండి మొదలవుతుంది . తరువాత యాత్రికులు గంగోత్రి ,కేదారనాథ్ ,బద్రీనాథ్ ని దర్శించుకుంటారు .

1. యమునోత్రి చరిత్ర(Yamunotri)
యమునోత్రి భారతదేశంలోని రెండవ అత్యంత పవిత్రమైన నది, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో యమునా నది పుట్టింది. యమునోత్రి ధామం తీర్థయాత్రలో మొదటి స్టాప్. యమునా నది నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి . యమునోత్రి మందిరాన్ని 1839లో తెహ్రీ రాజు నరేష్ సుదర్శన్ షా నిర్మించారని చెపుతారు . యమునా దేవితో పాటు, గంగాదేవి విగ్రహం కూడా ఇక్కడ ఆలయంలో ఉంటుంది . ఆలయ సమీపంలో అనేక వేడి నీటి కుండాలు ఉన్నాయి; వాటిలో సూర్య కుండం చాలా ముఖ్యమైనది. సూర్యకుండం లో స్నానము చేసినవారికి పాపలతో పాటు రోగాలు కూడా నశిస్తాయి అని విశ్వాసం .

2. గంగోత్రి చరిత్ర(Gangotri)
గంగోత్రి ధామం గంగాదేవికి అంకితం చేయబడిన నేలగా చెపుతారు , మానవజాతి పాపాలను పోగొట్టడానికి భూమిపైకి గంగాదేవి వచ్చినట్లు చెబుతారు. గంగోత్రి పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగోత్రి హిమానీనదం నుండి గౌముఖ్ వద్ద ఈ నది ఉద్భవించింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న గంగోత్రి అసలు ఆలయాన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో గూర్ఖా జనరల్ అమర్ సింగ్ థాపా నిర్మించారు అని కధనం .

3. కేదార్‌నాథ్ చరిత్ర (Kedharnath)
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్‌నాథ్ చార్ ధామ్ యాత్రలో అత్యంత మారుమూల పుణ్యక్షేత్రం. నిజానికి కేదార్‌నాథ్ ఆలయాన్ని పాండవులు నిర్మించారనిచెబుతారు . ప్రస్తుత కట్టడాన్ని ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో పాత ఆలయ స్థలానికి ఆనుకుని నిర్మించారు. బూడిద రంగు రాతి నిర్మాణం దాని గంభీరమైన డిజైన్ ఇంకా అటువంటి కఠినమైన వాతావరణ పరిస్థితులు కలిగిన భూభాగంలో అనేక శతాబ్దాల పాటు నిలబడిఉన్న సామర్థ్యం కారణంగా ఈ ఆలయ నిర్మాణ అద్భుతం అని చెప్పచ్చు .

4. బద్రీనాథ్ చరిత్ర(Badri Nath)
హిందూ మతంలో బద్రీనాథ్ యాత్ర అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. 108 దివ్య దేశాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయం చార్ ధామ్ ఇంకా చోటా చార్ ధామ్ యాత్రలు రెండింటిలోనూ భాగమే , ఆదిశంకరాచార్యులు అలకనంద నదిలో బద్రీ స్వామి విగ్రహాన్ని కనుగొని, తప్త్ కుండ్ సమీపంలోని ఒక గుహలో ఉంచారు. 16వ శతాబ్దంలో, ఒక గర్వాల్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు, ఇది ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా ఏర్పడిన ఇబ్బందులతో చాలాసార్లు పునరుద్ధరించబడింది. నరుడు నారాయణుడుగా అవతరించిన భూమిగా బద్రీనాథ్ ధామం విలసిల్లుతుంది

Updated On 17 April 2023 5:39 AM GMT
rj sanju

rj sanju

Next Story