వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజు సింహాచలం నరసింహ స్వామి వారి దివ్య చందనోత్సవం అత్యంత శోభాయమానం గా జరుగుతుంది .భక్తులు కోరిన కోరికలను తీర్చటం తో పాటు కలియుగంలో మనకు మోక్షాన్ని కలిగించే అతి సులువైన మార్గం స్వామి వారి నిజరూప దర్శనం . ఏడాదిలో ఈ చందనోత్సవం రోజున స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు . వరాహం, నరసింహ అవతారాలు కలిసున్నఅరుదైన నరసింహ అవతారం కొలువైన దేవాలయం కేవలం ఆంధ్రప్రదేశ్ సింహాచలంలో మాత్రమే ఉండటం విశేషం .
వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజు సింహాచలం నరసింహ స్వామి వారి దివ్య చందనోత్సవం అత్యంత శోభాయమానంగా జరుగుతుంది .భక్తులు కోరిన కోరికలను తీర్చటంతో పాటు కలియుగంలో మనకు మోక్షాన్ని కలిగించే అతిసులువైన మార్గం స్వామివారి నిజరూపదర్శనం . ఏడాదిలో ఈ చందనోత్సవం రోజున స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు . వరాహం, నరసింహ అవతారాలు కలిసున్నఅరుదైన నరసింహ అవతారం కొలువైన దేవాలయం కేవలం ఆంధ్రప్రదేశ్ సింహాచలంలో మాత్రమే ఉండటం విశేషం .
శ్రీ మహా విష్ణువు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడుని సంహరించేందుకు వరాహావతారం ధరించాడు . హిరణ్యకశిపుడుని సంహరించేందుకు నృసింహావతారాన్ని ధరించాడు .అన్నదమ్ములైన వీరి సంహారానికి శ్రీ మహావిష్ణువు ధరించిన రెండు వేరు వేరు అవతారాలు వరాహ,నృసింహ అవతారాలు . హిరణ్యాక్షుని వధ అనంతరం ప్రహ్లదుని ప్రార్ధన మేరకు వరాహావతారం ముగించకుండానే హిరణ్యకశిపుడుని సంహరించేందుకు నృసింహుని అవతారం దాల్చి అతి భయానకమైన ఉగ్రనరసింహుని అవతారంలోహిరణ్యకశిపుడుని సంహారం చేసాడు శ్రీమహావిష్ణువు .
ఉగ్రరూపంలో ఉన్న నృసింహస్వామిని దేవతలు శాంతించమమని వేడుకుంటారు .ఎన్నోరకాల స్త్రోత్రాలు చదువుతారు . అయిన ఉపయోగంలేకపోగా, బ్రహ్మదేవుడుకి అనుకోకుండా చందన వృక్షం గుర్తువస్తుంది. చందన వృక్షానికి ఉష్ణం ,ఉగ్రం,తగ్గించి శాంత స్వభావాన్ని అందించే ప్రత్యేక శక్తిని వరంగా పొందింది . ఈ విషయం గుర్తుకువచ్చిన బ్రహ్మ దేవుడు ప్రహ్లదునికి ఈ సంగతి చెప్పగా ,ప్రహ్లదుడు స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతపరిచేందుకు చందసేవను చేసారు దానితో స్వామి శాంతించారు . ఆ తర్వాత ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహం, నృసింహరూపంలో సింహాచలం కొండలపై నరసింహస్వామి కొలువయ్యాడు అనేది పూరణ కధనం . అక్షయ తృతీయ రోజు ఇది జరగటంతో వైశాఖశుద్ధ తదియ రోజున నరసింహస్వామి చందనోత్సవాన్ని జరుపుతారు .