హిందూ మతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేకత ఉంది.

హిందూ మతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేకత ఉంది. ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది. అయితే..

మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి(SubrahmanyaShashti) అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు. కుమారస్వామి సర్పరూపంలో భూలోకంలోకి అడుగిడిన రోజుకే సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరు. అదేవిధంగా దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజును 'శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి' గా వ్యవహరిస్తారు.

ఈ ఏడాది షష్ఠి తిథి డిసెంబర్ నిన్నటి రోజు శుక్రవారం మధ్యాహ్నం 12:07 గంటలకు మొదలై ఈ రోజు (డిసెంబర్) 7 ఉదయం10:05 నిమిషాల వరకు కొనసాగుతుంది.. సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం.. సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండగ జరుపుకోవాలి. అందుకే డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని సూచిస్తున్నారు పెద్దలు...

ehatv

ehatv

Next Story