ఆషాఢ మాసం ముగిసి శ్రావణమాసం రావడంతో వివాహాలు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నారు
ఆషాఢ మాసం(Ashada masam) ముగిసి శ్రావణమాసం(Sravana masam) రావడంతో వివాహాలు(Marriages), ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు(auspicious Time) ఫిక్స్ చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు(House warming) సహా ఇతర శుభకార్యాలు లేక గత కొంత కాలంగా సందడి వాతావరణ లేకుండాపోయింది. శ్రావణమాసం రావడంతో ఇప్పుడు సందడి నెలకొంది. బంగారం దుకణాలు, బట్టల షాపులు, ఇతరత్రా దుకాణాల్లో గిరాకీలు పెరిగిపోయాయి. ఈనెల ఆగస్ట్ 7 నుంచి శుభముహూర్తాలు ప్రారంభమయ్యాయని పంతుళ్లు చెప్తున్నారు. ఈనెల 7, 8, 9, 10, 11, 14, 15,17,18, 22, 23, 24, 28 తేదీలు పెళ్లిళ్లకు, గృహప్రవేశాలకు మంచి ముహూర్తాలున్నాయని వేదపండితులు వెల్లడించారు. అయితే 17, 18 తేదీలు పెళ్లిళ్లకు అత్యంత మంచి ముహూర్తాలుగా పేర్కొంటున్నారు. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణ నెలకొంది. పురోహితులు, కల్యాణ మండపాలు, టెంట్ హౌస్, వంట మాస్టర్లు, కేటరింగ్, డీజేలకు బిజీ పెరిగిపోయింది. అంతేకాకుండా ఈ నెలలోనే శ్రావణ శుక్రవారాల పూజలు, వరలక్ష్మి వ్రతాలు కూడా ఉండడంతో అమ్మలక్కలు నెలంతా బిజీగా మారిపోనున్నారు.