అనంత పద్మనాభ చతుర్దశి(Ananta Padmanabha Chaturdashi) అంటే భాద్రపద శుక్ల చతుర్దశి రోజున జరుపుకునే వ్రతం. దీన్ని అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అని కూడా అంటారు. హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనది.
అనంత పద్మనాభ చతుర్దశి(Ananta Padmanabha Chaturdashi) అంటే భాద్రపద శుక్ల చతుర్దశి రోజున జరుపుకునే వ్రతం. దీన్ని అనంత చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అని కూడా అంటారు. హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనది. కష్టాలు చుట్టుముట్టినప్పుడు, ఇబ్బందులో ఇరకాటంలో పెట్టినప్పుడు వాటిల్లోంచి బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తోంది. పూర్వ కాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన కనిపిస్తుండటం విశేషం. పాండవులు(Pandavas) వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు(Dharmaraj) వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు(Krishna) అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశినాడు చేయమని చెప్పాడట. అనంతుడన్నా, అనంతపద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే అన్నాడు. యుగ, సంవత్సర, మాస తదితర కాలం అంతా తన స్వరూపమన్నాడు. అనంతపద్మనాభుడంటే కాల స్వరూపుడైన వైకుంఠవాసుడి అవతారమే శ్రీకృష్ణుడు. పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతమహిమతో కృతయుగంలో సుశీల-కౌండిన్య దంపతుల సకల సంపదలు, సుఖసంతోషాలతో జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి..