అమర్‌నాథ్‌ను(Amarnath) దర్శించుకోవాలనుకుంటున్నవారికి శుభవార్త. అమర్‌నాథ్ యాత్రం జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతుంది. దక్షిణ కశ్మీర్‌లోని(Kashmir) హిమాలయ(Himalayas) పర్వతాల్లో 3.880 మీటర్ల ఎత్తున ప్రతి ఏడాది కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు.
అమర్‌నాథ్‌ను(Amarnath) దర్శించుకోవాలనుకుంటున్నవారికి శుభవార్త. అమర్‌నాథ్ యాత్రం జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతుంది. దక్షిణ కశ్మీర్‌లోని(Kashmir) హిమాలయ(Himalayas) పర్వతాల్లో 3.880 మీటర్ల ఎత్తున ప్రతి ఏడాది కొలువుదీరే మంచు శివలింగాన్ని(Lord shiva) దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. గత ఏడాది ఇంచుమించు మూడున్నర లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నారు. ఈసారి అయిదు లక్షల మంది వచ్చే అకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది సంభవించిన ఆకస్మిక వరదలు 16 మంది భక్తుల ప్రాణాలు తీశాయి. ఈ సంఘటనతో పాఠాలు నేర్చుకున్న అధికారులు ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అమర్‌నాథ్‌కు వెళ్లే బట్కల్, పహల్‌గామ్(Pahalgam) దారులలో భారీగా మంచు పేరుకొని ఉంది. ఈ మంచును ఈ నెల 15 నాటికి తొలగించాలనుకుంటున్నారు. ఈ బాధ్యతను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తీసుకుంది. మరోవైపు యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.