లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అక్షయ తృతీయ (Akshaya Tritiya)ని మించిన శుభ సమయం ఉండదు . ఈ రోజున లక్ష్మి దేవిని ఆహ్వానానికి గుర్తుగా అందరు బంగారం కొనుగోలు చేస్తారు .నిజానికి బంగారం కొనాలన్న నియమం ఎక్కడ వివరించలేదు . కానీ లక్ష్మీదేవిని ఆరోజు ఇంటికి తెచ్చుకునే సంప్రదాయంలో భాగంగా బంగారం కొనాలి అనే ఆచారం మొదలైంది . అలాగే నిజానికి అక్షయ తృతీయ రోజు దానధర్మాలు చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది . ఈ రోజున పేదవారికి అవసరమైన వస్తువులను దానంచేయడం ద్వారా మీకు అక్షయ పుణ్యం లభిస్తుంది అలాగే లక్ష్మి దేవి (Lakshmi Devi)మిమ్మల్నికటాక్షిస్తుంది .

అక్షయతృతీయ రోజున లక్ష్మీదేవితో (Lakshmi Devi) పాటు విష్ణుమూర్తిని కూడా పూజించటం ఉత్తమం . ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మిదేవి మరింత సంతోషించి మీ జీవితంలో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మిదేవి అనుగ్రహంతో, మీ ఇంట్లో ఐశ్వర్యం సంపదలకు ఏలోటు ఉండదు. దీనితో పాటు, ఈ రోజున వినాయకుడుని పూజించటం శ్రేయస్కరం. అలాగేఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్తోత్ర పారాయణ చేయాలి .మహాలక్ష్మి అష్టకం ,అష్టలక్ష్మి స్తోత్రం వంటివి చదవటం వలన అమ్మవారు సంతోషిస్తుంది మీకు శుభాలను కలుగజేస్తుంది. ఈ రోజున లక్ష్మిదేవికి ఇష్టమైన పాయసం,క్షీరాన్నం వంటి మధుర పదార్దాలను నైవేద్యంగా సమర్పిస్తే సర్వశుభాలు ప్రసాదిస్తుంది ఆ తల్లి . మీ ఇంటి సంపద పెరుగుతుంది.
అలాగే అక్షయతృతీయ (Akshaya Tritiya) రోజున శుభకరమైన వస్తువులను కొనుగోలు చేయాలి . పసుపుకొమ్ములు ,కుంకుమ ,ఎర్రటి పూవ్వులు ,గాజులు చందనం ,శనగలు ,బెల్లం ,పంచదార , యాలుకలు ,లవంగం ,జాజికాయ వంటి సుంగంధ ద్రవ్యాలు లక్ష్మి దేవికి ప్రీతికరమైనవి ఇలాంటివి ఇంటికి తెచ్చుకోవటం శుభం . బంగారం ,వెండి వీలును బట్టి కొనుగోలు చేయటం శుభప్రదం . ఇలా చేయటం వలన మీ సంపదలు పెరుగుతాయి .
మీ ఇంట్లో చాలా కాలంగా ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉంటే, మీరు అక్షయ తృతీయ నాడు కొన్ని వస్తువులను దానంచేయటం మంచిది . అవి నీరు, కుంభం, పంచదార, ఫ్యాన్, గొడుగు, పండ్లు మొదలైనవి పేదవారికి లేదా పేద బ్రాహ్మణుడికి దానం చేయడం సర్వోత్తమం . అక్షయ తృతీయ (Akshaya Tritiya)నాడు ఈ వస్తువులను దానం చేసిన వారికి, లక్ష్మిదేవి (Lakshmi Devi) స్వయంగా వారి ఇంటికి వచ్చి నివాసం ఉంటుంది . ఆర్థిక ఇబ్బందులను ,ఇతర సమస్యలను తొలగిస్తుంది .