లక్ష్మి దేవికి ప్రతీక అయిన అక్షయ తృతీయ (Akshaya Tritiya)పండుగను ఏప్రిల్ 22, శనివారం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ శుక్ల పక్షం వైశాఖమాసం మొదలైన వెంటనే వచ్చే పండుగ . ఈ రోజున ఏ శుభకార్యమైనా, శుభకార్యాలు చేయాలన్నా,ఎలాంటి ముఖ్యమైన పనులు పారంభించాలన్న పంచాంగం చూడాల్సిన అవసరం లేదు, ఈ రోజు చేసే ఏ శుభ కార్యమైనా చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా ఉంటుంది . దీనితో పాటు సత్యయుగం, త్రేతాయుగం కూడా ఈ రోజునే ప్రారంభమయినట్లు పూరణ కధనం .

లక్ష్మి దేవికి ప్రతీక అయిన అక్షయ తృతీయ (Akshaya Tritiya)పండుగను ఏప్రిల్ 22, శనివారం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ శుక్ల పక్షం వైశాఖమాసం మొదలైన వెంటనే వచ్చే పండుగ . ఈ రోజున ఏ శుభకార్యమైనా, శుభకార్యాలు చేయాలన్నా,ఎలాంటి ముఖ్యమైన పనులు పారంభించాలన్న పంచాంగం చూడాల్సిన అవసరం లేదు, ఈ రోజు చేసే ఏ శుభ కార్యమైనా చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా ఉంటుంది . దీనితో పాటు సత్యయుగం, త్రేతాయుగం కూడా ఈ రోజునే ప్రారంభమయినట్లు పూరణ కధనం . ఈసారి అక్షయ తృతీయ (Akshaya Tritiya) మరింత శుభప్రదమని జ్యోతిష్యులు చెపుతున్నారు ఈ రోజున అనేక శుభ యోగాలు ఏర్పడినట్లు సమాచారం , ఈ కారణంగా ఈ రోజు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది . అక్షయతృతీయ రోజు (Akshaya Tritiya)న ఏర్పడే ఈ పవిత్రమైన యోగంలో చేసే పూజలు, జపం, దానధర్మాలు మొదలైన పనులు చాలా విశేష శుభఫలితాలను ఇస్తాయి. అక్షయతృతీయ నాడు కలిగే ఈ శుభయోగం యొక్క విశేషాలు తెలుసుకుందాం...

అక్షయ తృతీయ (Akshaya Tritiya)నాడు సర్వార్థసిద్ధి అనే శుభయోగం ఏర్పడుతోంది. ఈ యోగం రాత్రి 11:24 నుండి ప్రారంభమవుతుంది ,ఏప్రిల్ 23 ఉదయం 05:48 వరకు ఈ యోగకాలం ఉంటుంది. ఈ శుభయోగంలో ప్రారంభించిన ఏ శుభకార్యమైనా కచ్చితంగా విజయవంతమవుతుంది. ఇది చాలా పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది . అలాగే, ఈ యోగం వలన అన్ని కోరికలు తప్పక నెరవేరుతాయి . సర్వార్థ సిద్ధి యోగంలో శుక్ర అష్ట, పంచక, భద్ర మొదలైన అశుభ యోగాలకు అశుభ ఫలితాలు ఉండవు, ఈ యోగం అశుభాలను దూరం చేస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, ఆస్తి, ఆభరణాలు కొనుగోలు చేయడం వంటివి ఈ యోగంలో చాలా ప్రయోజనకరంగా అత్యంత లాభయదాయకంగా ఉంటాయి .

Updated On 21 April 2023 12:46 AM GMT
rj sanju

rj sanju

Next Story