కోనసీమ(Konaseema) జిల్లా అయినవిల్లిలో శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయం ఉంది.

కోనసీమ(Konaseema) జిల్లా అయినవిల్లిలో శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయం ఉంది. అక్కడ వెలిసిన ఆ విఘ్నేశ్వరుడు కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు. విద్యార్థలకు(Student) అయితే పరీక్షలలో(Exam) పాసయ్యేటట్టు చూసే చల్లని దేవుడు. వినాయకుడి గుడి(Vinayaka temple) అయినప్పటికీ అక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. తమ పిల్లలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చదువులు కొనసాగాలని భక్తులు ఎంతో విశ్వాసంతో ఈ సిద్ది వినాయకుడి సిద్ది కోరుతూ తొలి అక్షరాలు దిద్దిస్తుంటారు తల్లిదండ్రులు.. ఇక ఈ మండల పరిధిలో ఎవరింట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా ఈ వినాయకుడికే తొలి పిలుపు. తమ ఇంట జరిగే శుభకార్యపు శుభలేఖను(Invitation) మొదటిగా స్వామివారికే ఇచ్చి స్వామీ మీ చల్లని చూపులు మా ఇంట ప్రసరింపజేసి శుభకార్యాన్ని చల్లగా జరిపించు స్వామీ అంటూ వేడుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ స్వామివారికి మాఘమాసంలో వచ్చే శ్రీపంచమి రోజున జరిగే లక్ష పెన్నుల పూజ(Pens Pooja) విశేష ఆదరణ పొందుతోంది. సరస్వతీదేవికి ప్రీతి పాత్రమైన ఈ తిథి రోజు భారతీయ వాజ్మయం ప్రకారం అత్యంత వేగంగా రాయగలిగే వాడన్న పేరున్న వినాయకుడికి లక్ష పెన్నులతో(Pen pooja) ఇక్కడ పూజారులు ప్రత్యేక పూజ జరిపిస్తారు. ఈ పెన్నులన్నీ మూల విరాట్టు పాదపద్మాల వద్ద ఉంచి వేదమంత్రాలతో విశేష పూజ జరిపిస్తారు. మొదట వందా రెండొందల పెన్నులతో సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెన్ పూజా క్రతువు, విద్యార్థులు వారి తల్లి దండ్రుల నుండి వస్తున్న డిమాండ్ తో లక్షల పెన్నులకు చేరింది. ఫిబ్రవరిలో విద్యా సంవత్సరం చివరి దశలో విద్యార్థులకు ఎంతో కీలకమైన పరీక్షా సమయానికి ముందు ఈ పూజ జరుగుతుంది. విద్యార్థులు తమ సంవత్సర కష్టాన్ని పేపర్ పై పెట్టే సమయంలో ఆ గణపతి ఆశీస్సులు ఆశించడమే కాదు......ఆయన పాద పద్మాల వద్ద ఉంచి పూజించిన పెన్ను ఉంటే చాలు తమ కష్టం ఫలించి తీరుతుందని విశ్వసిస్తారు. అందుకే ఆ పెన్నుల కోసం వేలాదిగా క్యూలో నిలుచుంటారు. ఆ పెన్ను చేతికి దక్కితే పరీక్షలను ఎదుర్కొనేందుకు తమ పాశుపతాస్త్రమే దొరికిందన్నంత ధైర్యం పొందుతారు.

Eha Tv

Eha Tv

Next Story