భారతీయులకు అది పవిత్ర క్షేత్రం. ఉత్తరాఖండ్‌లోని(UttaraKhand) హిమాలయాల్లో(Himalaya) వెలిసిన కేదార్‌నాథ్(kedharnath) ధామం. కేదార్‌నాథ్‌ను దర్శించుకోవడం జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు చాలామంది. విదేశీయులు కూడా ఈ ఆలయాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి మహిమాన్విత ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ మహిళ ఆలయ గర్భగుడిలో ఉన్న జ్యోతిర్లింగంపై కరెన్సీ నోట్లను(Currency notes) వెదజల్లింది.
భారతీయులకు అది పవిత్ర క్షేత్రం. ఉత్తరాఖండ్‌లోని(UttaraKhand) హిమాలయాల్లో(Himalaya) వెలిసిన కేదార్‌నాథ్(Kedarnath) ధామం. కేదార్‌నాథ్‌ను దర్శించుకోవడం జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు చాలామంది. విదేశీయులు కూడా ఈ ఆలయాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి మహిమాన్విత ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ మహిళ ఆలయ గర్భగుడిలో ఉన్న జ్యోతిర్లింగంపై కరెన్సీ నోట్లను(Currency notes) వెదజల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సదరు మహిళలపై చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ పోలీసులను కోరింది. ఆ మహిళ ఎవరన్నది మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు.
ఆలయ గర్భగుడిలోని శివలింగానికి పక్కనే నిలబడి ఉన్న మహిళ కేదారేశ్వరుడిపై కరెన్సీ నోట్లు వెదజల్లుతున్నట్టు వీడియోలో స్పష్టంగా ఉంది. ఆ సమయంలో గర్భగుడిలో కొందరు భక్తులు(devotees) కూడా ఉన్నారు. ఆలయ పురోహితులు(Priest) మంత్రాలు పఠిస్తూ కనిపించారు. మహిళ ఇలా అనుచితంగా ప్రవర్తిస్తున్నప్పటికీ అక్కడ ఉన్న భక్తులు కానీ, పురోహితులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
నిజానికి కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో ఫోటోలు, వీడియోలు తీయకూడదు. నిషేధం ఉందక్కడ. అయినప్పటికీ ఆ వీడియో బయటకు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఈ ఘటనపై ఆలయ కమిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచితంగా ప్రవర్తించిన సదరు మహిళపై విచారణ జరిపించాలని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోరారు.