శ్రీవిద్య ఉపాసన, గురువుల దగ్గర దీక్ష తీసుకుని మనం మొదలుపెట్టినప్పుడు, మనకు గురువులిచ్చే మొదటి లలితా మంత్రం అది

శ్రీవిద్య ఉపాసన, గురువుల దగ్గర దీక్ష తీసుకుని మనం మొదలుపెట్టినప్పుడు, మనకు గురువులిచ్చే మొదటి లలితా మంత్రం అది.
పంచదశి తర్వాత,
మూలమంత్ర దీక్ష,
గురుపాదుకా దీక్ష,
షోడశీ దీక్ష,
పూర్ణ అభిషిక్తా,
సామ్రాజ్య దీక్ష,
మహాపాదుకాదీక్ష,
మహా సామ్రాజ్య దీక్ష
అనే 8 స్థాయిలు ఉన్నాయి.
దీనికి సంబంధించి మొదట పంచదశి, అనే దాని గురించి చెప్తే మిగతావన్నీ కూడా అర్థమయిపోతాయి.
లలితా అమ్మవారికి సంబంధించిన ప్రధానమైన మంత్రము పంచదశి.
పంచదశి అంటే 15 అని అర్థం.
15 బీజాక్షరాలతో కూడుకున్న మంత్రం కనుక, ఆ మంత్రాన్ని గుప్త భాషలో కేవలం పంచదశి అని మాత్రమే పిలుస్తారు.
ఈ పంచదశి మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు, దానిని మనకి మూడు కూటాలుగా ఉపదేశిస్తారు.
మొదటి కూటం పేరు వాక్ భావ కుటం. రెండవ కూటం పేరు కామరాజు కూటం లేదా మధ్యకూటం. ఆఖరి కూటం పేరు శక్తి కూటం.
వీటిల్లో వాగ్భావకూటము, లలితాంబికా యొక్క ముఖాన్ని సూచిస్తుంది.
కామరాజు కూటము ఆవిడ, మెడ దగ్గర నుండి ఆవిడ పొట్ట వరకు ఉన్న భాగాన్ని సూచిస్తుంది.
శక్తికూటము పొట్ట కింద ఉండే మిగతా భాగాన్ని సూచిస్తుంది.
ఈ మూడు కూటాలను తలకిందులుగా ఉన్న ఒక త్రికోణంగా గీస్తే, అదే ఆవిడ యోనిని, అందుకని మొత్తం ప్రపంచానికే మొదలుగా మనం చెప్పుకునే, శక్తిని అవి సూచిస్తాయి.
అందుకే ఈ మంత్రాన్ని గురువులు అంత గుప్తంగా ఉంచారు.
ఈరోజుల్లో అవి మనకి, ఎక్కడైనా పుస్తకాల్లోనూ అంతర్జాలంలోనూ దొరికిపోతున్నా, గురువు ఉపదేశం లేకుండా వాటిని చేయటం వల్ల, అటు ఉపయోగం లేకపోగా ఇటు నష్టం వాటిల్లుతుంది.
ఇదేవిధంగా మూల మంత్రము, అనేది మనము ఏ అమ్మవారినైతే లలితాంబిక అని పిలుస్తున్నామో ఆవిడ మూల బీజాక్షరాన్ని మనకు రెండవ స్థాయిలో గురువు ఉపదేశం ఇస్తారు.
ఆ తరువాత గురు పరంపరలో, లభిస్తున్న గురుపాదుకలను మన నెత్తి మీద పెట్టి, మనకి మనం వేరే వారికి పంచదశిని కానీ మూలమంత్రాన్ని కానీ ఇచ్చే అర్హతను కల్పిస్తారు.
ఆ తరువాత షోడశి అని పంచదశి లాగానే, 16 బీజాక్షరాలు ఉండే, మరో మహాకూటన్ని అంటే ఎనిమిది అక్షరాలు, నాలుగు అక్షరాలు, నాలుగు అక్షరాలుగా, మనం రాస్తే, అవి ఒక తలకిందులుగా ఉన్న త్రికోణాన్ని తయారుచేసి, అమ్మ యొక్క శక్తి స్థానాన్ని తయారు చేస్తాయో, అటువంటి ఆ మంత్రాన్ని దానికి సంబంధించిన యంత్ర విద్యను మనకు ఉపదేశిస్తారు.
దీని తరువాత, మనకు లలితా దేవి తంత్ర ఉపాసనను,
1 ఆరోగ్యం కోసం,
2 సిరి సంపదల కోసం,
3 కీర్తి కోసం,
4 భూతప్రేత పిశాచ నరదృష్టి బాధల నుండి విముక్తి కోసం,
5 శంఖిణి-ఢాకిని-షాకిని అమ్మలను చెడు ప్రయోగం చేసిన దాని విరుగుడు కోసం,
6 వాక్ శుద్ధి కోసం
ఆరు భాగాలుగా విడగొట్టి, మనకు నేర్పుతారు.
ఆ తర్వాత పూర్ణాభిశిక్త దీక్ష అంటే మనము కేవలం మన కోసమే కాకుండా ఇతరుల కోసం ఈ షోడశని ఉపయోగించి, తంత్ర పద్ధతిలో ఉపయోగపడే విధంగా, నేర్పిన ప్రక్రియలు చేయటానికి మనకు గురువులు అర్హత కల్పిస్తారు.
సామ్రాజ్యదీక్ష అంటే, మనము ఈ షోడశిని వేరే వారికి ఉపదేశించే అర్హత మనకు గురువులు కల్పిస్తారు.
మహాపాదుకా దీక్ష అంటే, గురు పరంపరలో వచ్చిన పాదుకల లాంటివే మనకు తయారు చేసి ఇచ్చి, మనము మరి కొంత మంది లలితా ఉపవాసకులను తయారు చేసి గురువుగా మారటానికి మనకు గురువులు అర్హత కల్పిస్తారు.
మహా సామ్రాజ్య దీక్ష అంటే, మనము ఏ పీఠంలో అయితే దీక్ష తీసుకున్నామో, అదే పీఠానికి మనల్ని పీఠాధిశులుగా కూర్చోబెట్టటం.
