సోషల్ మీడియా ప్రస్తుత యువత మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వీడియోస్ ,వెబ్ సిరీస్ లాంటివి వారిలో నేరపూరిత ఆలోచలను ప్రేరేపించే విధంగా ఉంటునాయి. తాజాగా నిత్యం వస్తున్న వార్తల్లో ఈ ఉదంతాలు వింటూనే ఉన్నాం. వీరిలో ముఖ్యం గా 18 ఏళ్ళ లోపు వయసు గలవారు కావటం విశేషం . నేరాలకు సంబందించిన ఎన్నో విషయాలను సమాచారాన్ని తెలుసుకోవటానికి యూట్యూబ్ ,గూగుల్ సహాయం తీసుకుంటున్నారు . ఎన్ని రకాల అవగాహనా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈ నేరాలు […]

సోషల్ మీడియా ప్రస్తుత యువత మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వీడియోస్ ,వెబ్ సిరీస్ లాంటివి వారిలో నేరపూరిత ఆలోచలను ప్రేరేపించే విధంగా ఉంటునాయి. తాజాగా నిత్యం వస్తున్న వార్తల్లో ఈ ఉదంతాలు వింటూనే ఉన్నాం. వీరిలో ముఖ్యం గా 18 ఏళ్ళ లోపు వయసు గలవారు కావటం విశేషం . నేరాలకు సంబందించిన ఎన్నో విషయాలను సమాచారాన్ని తెలుసుకోవటానికి యూట్యూబ్ ,గూగుల్ సహాయం తీసుకుంటున్నారు . ఎన్ని రకాల అవగాహనా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈ నేరాలు ఆగటం లేదు. తల్లితండ్రులు సైతం తమ పిల్లల చదువు ,ఆలోచనలు పైన స్మార్ట్ ఫోన్స్ ప్రభావితం చేయటం ఆందోళనకరంగా ఉన్నయంటూ వాపోతున్నారు .

నాగపూర్ లో 15 ఏళ్ళ బాలిక చేసిన దారుణమైన ఈ పనికి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే !
15 ఏళ్ళ మైనర్ బాలిక యూట్యూబ్ లో చూసి తనకు తానే కాన్పు చేసుకుంది . పుట్టిన ఆ పసి ప్రాణాన్ని కళ్ళు తెరవకముందే గొంతు నులిమి చంపింది . మహారాష్ట్ర నాగపూర్ లో ని అంబజారీ ప్రాంతానికి చెందిన బాలికకు సోషల్ మీడియా యాప్ ద్వారా ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. చాటింగ్ ,ఫోన్ కాల్స్ ద్వారా కొంత కాలం గడిపాక ఆ యువకుడు సదరు బాలికను కలవటం జరిగింది .దీనితో శారీరకంగా కూడా వీళ్లు దగ్గరయ్యారు . కొంతకాలానికి ఆ అమ్మాయి గర్భం దాల్చింది . పొట్ట పెద్దదిగా కనిపించటంతో ఇంట్లో ఆరా తీయగా ఒంట్లో బాగాలేక పడుతున్న ఇబ్బందిగా వారిని పక్క దారి పట్టించింది .

యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఇంట్లో ఎవరు లేని సమయం లో ప్రసవించింది . ఆడపిల్ల పుట్టగా పసికందుని కళ్ళు తెరవక ముందే గొంతు నులిమి చంపి మృత శిశువును పెట్టెలో పెట్టి దాచింది. కాన్పు తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురి అయిన బాలికను గుర్తించిన తల్లి గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు శిశువు మృతదేహానికి పోస్టుమార్టుమ్ కి తరలించారు .

Updated On 6 March 2023 2:33 AM GMT
Ehatv

Ehatv

Next Story