ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ క్రేజ్ పలువురి ప్రాణాలను తీస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ క్రేజ్ పలువురి ప్రాణాలను తీస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హయంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట సమీపంలోని జాతీయ రహదారిపై ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి మోటార్‌బైక్‌పై విన్యాసాలు చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం యువకుడు స్పోర్ట్స్ బైక్‌పై విన్యాసాలు చేస్తున్నాడు. అతను అదుపు తప్పి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.

వర్షంలో స్టంట్స్ చేస్తుండగా బైక్ బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ కిందపడ్డారు. తీవ్ర గాయాలపాలై ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ పైనుంచి పడ్డ యువకులను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఓ యువకుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. తీవ్ర గాయాలపాలైన మరో యువకుడిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శనివారం సాయంత్రం విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్ద అంబర్‌పేట్ సమీపంలో ఇద్దరు యువకులు బైక్‌తో స్టంట్ చేశారు. సింగిల్ వీల్‌పై బైక్‌ నడుపుతూ వెళుతున్నప్పుడు బైక్ అదుపు తప్పి కిందపడగా.. శివ అనే యువకుడు చనిపోయాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రద్దీగా ఉండే రోడ్లపై చాలా మంది యువకులు మోటార్‌బైక్‌లపై విన్యాసాలు చేస్తున్నారు. కొంతమంది థ్రిల్ కోసం.. మరికొందరు సోషల్ మీడియాలో ‘లైక్‌లు’ సంపాదించడానికి ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story