కొత్తగా పెళ్లిచేసుకొని అత్తారింట్లో కోటి ఆశలతో అడుగు పెట్టింది ఓ అమ్మాయి .. కానీ పెళ్ళైన కొన్ని రోజుల్లోనే ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి . కట్టుకున్నవాడిని నమ్ముకొని కన్నవాళ్ళని సైతం వదులుకొని వస్తారు ఆడపిల్లలు. కర్ణాటకలోని ఒక మహిళా జీవితంతో అత్తింటివాళ్ళు ఆడుకున్నారు . కట్టుకున్నవాడు పట్టనట్టు ఉండేవాడు . కొడుకులాంటి మరిది కామంతో చూసేవాడు . అత్తమామలు అదనపు కట్నం కోసం వేదించే వారు . సహనం కోల్పోయిన యువతీ ఏమి చేసిందంటే ?
కొత్తగా పెళ్లిచేసుకొని అత్తారింట్లో కోటి ఆశలతో అడుగు పెట్టింది ఓఅమ్మాయి .. కానీ పెళ్ళైన కొన్ని రోజుల్లోనే ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి . కట్టుకున్నవాడిని నమ్ముకొని కన్నవాళ్ళని సైతం వదులుకొని వస్తారు ఆడపిల్లలు. కర్ణాటకలోని ఒక మహిళా జీవితంతో అత్తింటివాళ్ళు ఆడుకున్నారు . కట్టుకున్నవాడు పట్టనట్టు ఉండేవాడు . కొడుకులాంటి మరిది కామంతో చూసేవాడు . అత్తమామలు అదనపు కట్నం కోసం వేదించే వారు . సహనం కోల్పోయిన యువతీ ఏమి చేసిందంటే ?
2022లో బెంగళూరుకు చెందిన బాధిత మహిళ స్వప్నకు (పేరు మార్చడం జరిగింది)ప్రమోద్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లయింది.. అమ్మాయి పెళ్లి ఘనంగా 30 లక్షల ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా జరిపించారు . కట్నకానుకలు ఘనంగా ఇచ్చారు . అల్లారుముద్దుగా పెంచుకున్న ఆడపిల్లను అత్తారింటికి పంపించారు . కొత్త జీవితం మొదలయ్యే మొదటి రాత్రే ఆమెకు భర్తతో చేదుఅనుభవం. పక్కన పెళ్ళాన్ని పట్టించుకోకుండా facebook ,ఇంస్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటున్నాడు . రీల్స్ లో వేరేఅమ్మాయిలతో వీడియో చేయటమే అతగాడి పని. ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా ఆమెతో భర్త గడపలేదు.మరో పక్క సొంత వదినతో అసభ్యంగా ప్రవర్తించేవాడు మరిది. ఈ విషయాలు చెప్పిన అత్తమామలు పట్టించుకోకుండా అదనపుకట్నం కోసం ఆమెను మరింత హింసించేవాళ్ళు .
అత్తింటి వేధింపులు భరించలేక ఆమె బెంగళూరు తూర్పు విభాగం పోలీసులను ఆశ్రయించింది. సొంత ఇల్లు ఉందని నమ్మించి. పెళ్లిచేసుకున్నారని .. అద్దె ఇంట్లో ఉంటున్నారని.. తనను పుట్టింటి నుంచి అదనంగా డబ్బు తేవాలంటూ వేధిస్తున్నారని,మరిది ప్రవర్తన ,భర్త నిర్లక్ష్యంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు భర్త ప్రమోద్, మరిది, అత్త మామలపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.