హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూగ, చెవిటి మహిళను అత్యాచారం చేసిన ఓ యువకుడు ఆమెను బాత్రూమ్‌లో బంధించాడు.

Woman rape in humayun nagar hyderabad
హైదరాబాద్(Hyderabad)లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూగ, చెవిటి మహిళను అత్యాచారం చేసిన ఓ యువకుడు ఆమెను బాత్రూమ్‌లో బంధించాడు. హైదరాబాద్ హుమయూన్ నగర్(Humayun Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ నగర్ కాలనీలో సాయి(Sai) అనే యువకుడు మూగ, చెవిటి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళను బాత్ రూం(Bathroom)లో బంధించి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను లోపలే ఉంచి గడియ పెట్టి పారిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హుమయూన్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్(Arrest) చేశారు. బాధిత మహిళ భర్త కూడా మూగ వాడే కావడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
