హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. కీచకుడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ట్రైన్‌లో నుండి దూకేసింది.

హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. కీచకుడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ట్రైన్‌లో నుండి దూకేసింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు అవ్వడంతో గాంధీ ఆసుపత్రికి తరలింపు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా కొంపల్లి వద్ద యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడు. బోగీలో యువతి ఒక్కరే ఉండటంతో అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడుపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ఫోన్ మరమ్మతు కోసం సికింద్రాబాద్(Secundrabad)కు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఎంఎంటీఎస్(MMTS)లో మేడ్చల్(Medchal)కు బయలుదేరింది. మహిళల కోచ్‌లో ఆమె ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ (Alwal)స్టేషన్‌లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉంది. ఇదే అదునుగా భావించిన ఓ యువకుడు (25) ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి (Kompally)సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)కి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
