మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికురాలు బత్తుల ఓదెమ్మ (65) మంచి నీటిగా భావించి రంగులేని దోమల నివారణ ఫాగింగ్ లిక్విడ్‌ను తాగింది.

మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికురాలు బత్తుల ఓదెమ్మ (65) మంచి నీటిగా భావించి రంగులేని దోమల నివారణ ఫాగింగ్ లిక్విడ్‌ను తాగింది. కొత్తగూడెం మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డులో పనిచేస్తున్న మహిళకు దాహం వేయడంతో ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో నిల్వ ఉంచిన ద్రవాన్ని తాగగా.. ఆమె అస్వస్థతకు గురైంది.

స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. ఆసుపత్రి వైద్యులు, మున్సిపల్ అధికారులు కార్మికురాలికి సరైన వైద్యం అందించకపోవడంతో ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు ఫిర్యాదు చేశారు. మహిళ కుటుంబానికి పరిహారంగా 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద నిరసనకు దిగారు. ఎమ్మెల్యే కె.సాంబశివరావు తక్షణ సాయంగా రూ.3లక్షలు, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.10వేలు ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగంతో పాటు పక్కా ఇంటిని ఇస్తామని ప్రకటించారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story