రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్ దేవ్ పల్లిలో సోమవారం ఉదయం కంటైనర్ బీభత్సం సృష్టించింది. లక్ష్మీ గూడ వద్ద రోడ్డుపై వెళుతున్న మోటర్ సైకిల్ ను కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న మహిళ తలకు తీవ్రమైన గాయమై స్పాట్ లో మృతిచెందింది.

Woman died after container collided with bike in Mailardevpally
రంగారెడ్డి(Rangareddy) జిల్లా రాజేంద్రనగర్(Rajendranagar) మైలార్ దేవ్ పల్లి(Mailardevpally)లో సోమవారం ఉదయం కంటైనర్(Container) బీభత్సం సృష్టించింది. లక్ష్మీ గూడ(Lakshmiguda) వద్ద రోడ్డుపై వెళుతున్న మోటర్ సైకిల్ ను కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మోటర్ సైకిల్(Bike) పై ప్రయాణిస్తున్న మహిళ తలకు తీవ్రమైన గాయమై స్పాట్ లో మృతిచెందింది. కంటైనర్ డ్రైవర్ ను పట్టుకొని స్థానికులు చితకబాదారు. మృతురాలిని గోషామహల్(Goshamahal) కు చెందిన దుర్గాదేవి(Durgadevi) గా గుర్తించారు. దుర్గాదేవి మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
