అతనికి భార్య ఉంది.. అయినా కూడా వేరే యువతితో ప్రేమాయణం నడిపాడు.
అతనికి భార్య ఉంది.. అయినా కూడా వేరే యువతితో ప్రేమాయణం నడిపాడు. నీకు భార్య ఉంది అయినా నన్ను ప్రేమించడం ఏంటని ప్రశ్నించినా… నాకు నువ్వే కావాలని మాయమాటలతో నమ్మించాడు. నిన్నే పెళ్లాడుతా అంటూ నమ్మించి ఆ యువతికి దగ్గరయ్యాడు. ఆ యువతితో ప్రేమాయణం కొనసాగించాడు. ఈ మోసగాడి ప్రేమలో నిజాయితి ఉందని నమ్మిన ఆ యువతి సర్వం సర్పించింది. తన భార్యను మోసం చేసే అతడు తనని మోసం చేయడని గుడ్డిగా నమ్మింది. ఆ వయస్సులో అతను చెప్పేదంతా నిజమే అని నమ్మి అతనితో ప్రేమలో పడింది. ఇద్దరు దగ్గరయ్యారు. కానీ చివరకు మోసపోయానని గ్రహించిన ఆయువతి ఆత్మహత్యకు(Suicide) పాల్పడింది. తన చావుకు ప్రియుడే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు ప్రియుడు ఇంటిముందు ధర్నాకి దిగారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహబూబాబాద్(Mahaboobnagar) జిల్లా మరిపెడ(Maripeda) మండలం తానంచర్ల శివారు జెండాల తండాలో అనూష కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. అక్కడే భుక్య సురేష్ కుటుంబం కూడా ఉంటుంది. భుక్య సురేష్‌కు ఇంతకు ముందే పెళ్లైంది. భుక్య సురేష్‌కు(Suresh) అనూషతో(anusha) పరిచయం ఏర్పడింది. వీరద్దరూ కొద్ది రోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే అనూషను ప్రేమిస్తున్నానంటూ భుక్య సురేష్ వెంటపడసాగాడు. పెళ్లైందని మరి తనతో ప్రేమ ఏంటని అనూష ప్రశ్నించింది. ఎవరి స్థానం వారిదే నిన్ను కూడా పెళ్లి చేసుకుంటానని అనూషను నమ్మబలికాడు సురేష్. సురేష్ మాటలు నమ్మిన అనూష ఇద్దరూ సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు. అనూషను సురేష్ అన్ని విధాలా అనుభవించాడు. రానురాను పెళ్లి విషయంపై అనూష సురేష్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. సురేష్ చెప్పిన సమాధానం ఇష్టంలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు తెరిచి చూడా అనూష ఆత్మహత్య చేసుకుని ఉంది. అనూష మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంట్లో సూసైడ్ నోట్ రాసి అందులో తన చావుకు కారణం సురేషేనని తెలిపింది. దీంతో ఆగ్రహంతో భుక్య సురేష్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. తన కూతురు భుక్య సురేష్ వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారిస్తున్నారు. సురేష్‌పై కేసు నమోదు చేశారు.