బిహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున కతిహార్‌లో ట్రిపుల్ మర్డర్ ఘటన సంచలనం సృష్టించింది.

Woman and two children strangled to death in Katihar
బిహార్(Bihar) రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున కతిహార్(Katihar)లో ట్రిపుల్ మర్డర్(Triple Murder) ఘటన సంచలనం సృష్టించింది. జిల్లాలోని బల్లియా బెలోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగ్‌పూర్(Singhpur) గ్రామంలో ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలను గొంతు కోసి చంపారు. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి జరిగింది. ఉదయం గదిలో ముగ్గురి మృతదేహాలు రక్తసిక్తమై కనిపించాయి.
సమాచారం ప్రకారం.. మరణించిన మహిళ సఫాద్ జరీన్(Safad Zareen) తన ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల కొడుకుతో ఇంట్లో ఉంది. మృతురాలి భర్త గ్రామ సమీపంలోని ముహర్రం(Muharram) జాతర చూసేందుకు వెళ్లాడు. ఇంతలో నేరస్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. తెల్లవారుజామున రక్తం(Blood)తో తడిసిన ముగ్గురి మృతదేహాలు(Dead Bodies) లభ్యమయ్యాయి. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. హత్యలకు గల కారణాలు తెలియాల్సివుంది.
