కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి కడతేర్చాలని చూసింది ఓ భార్య. అందుకు రూ.10 లక్షల సుపారీ ఇస్తానని కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంది.

కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి కడతేర్చాలని చూసింది ఓ భార్య. అందుకు రూ.10 లక్షల సుపారీ ఇస్తానని కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంది. కానీ సుపారీ ముఠాలోని ఓ వ్యక్తి అత్యాశ వల్ల సీన్‌ రివర్స్‌ అయింది. నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన ధరావత్‌ సుమన్‌కు ఇదే మండలం మహేశ్వరం తండాకు చెందిన భూక్యా మంజులతో 2018లో పెళ్లి జరిగింది. సుమన్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ రంగ సంస్థలో బ్యాంకు పీవోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరి ఒక పాప ఉన్నది. 3 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. మంజుల ఎలాగైనా భర్తను చంపాలని ప్లాన్‌ వేసింది. మంజుల బావ, సమీప బంధువు నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన మోతీలాల్‌ సహాయంతో ముఠా సభ్యులను కలిసి రూ.10 లక్షలు ఆఫర్‌ చేసింది. రాయపర్తి మండలానికి బానోత్‌ నరేశ్‌, తొర్రూరు మండలానికి చెందిన మల్లేశ్‌, నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గోపితో రూ.10లక్షల డీల్‌ మాట్లాడుకుంది. హోలీ పండగ తర్వాత సుమన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కొన్ని రోజుల క్రితం సుమన్‌కు ముఠా సభ్యుడైన నరేష్‌ ఫోన్‌ చేశాడు. తనకు రూ.3 లక్షలు ఇస్తే విలువైన సమాచారం ఇస్తానని చెప్పాడు. అనుమానం వచ్చిన సుమన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరేష్‌ ఫోన్‌ను ట్రేస్‌ చేసి పట్టుకోగా అసలు విషయం బయటపడింది. సుమన్‌ను హత్య చేసేందుకు డీల్‌ కుదుర్చుకున్నామని ఇందుకుగాను ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున ముగ్గురికి అడ్వాన్స్ ఇచ్చినట్లు తేలింది. ముఠా సభ్యలైన గోపి, మోతీలాల్, నరేష్‌, మంజులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ehatv

ehatv

Next Story