వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ భార్య నీచ పర్వానికి దిగింది.

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ భార్య నీచ పర్వానికి దిగింది. తన బావతో కలిసి మద్యం సీసాలో పాయిజన్ కలిపి కట్టుకున్న భర్తను హతమార్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగింది. పేటచెరువు గ్రామంలో బుట్టల నరేష్ ఫిబ్రవరి 10న మద్యం సేవించిన తర్వాత వాంతులు రావడంతో కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఇంటికి తీసుకుని వచ్చారు.. అనంతరం మరుసటి రోజు కూడా వాంతులు అయ్యి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతటితో తన వివాహేతర సంబంధానికి అడ్డుతొలిగిపోయిందని లోలోన సంతోషపడింది భార్య. అయితే అసలు సమస్య ముందుముందు రానుందని ఊహించలేదు. దినకర్మ రోజు బుట్టల నరేష్ తెచ్చుకున్న మద్యం సీసాలో మిగిలి ఉన్న ఆల్కహాల్‌ను మృతిడికి బావ వరుస అయిన వ్యక్తి సేవించాడు. దీంతో అతనికి కూడా వాంతులు అయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో బంధువులు పాల్వంచ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరీక్షించిన వైద్యులు అతను తాగిన మందు సీసాలో విషం కలిసిందని వెల్లడించారు. దీంతో మృతిడి తల్లి పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలైన విషయం బయటపడింది. విచారణలో ఈ వివాహేతర సంబంధం గురించి వెలుగుచూసిందని పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ తెలిపారు. బుట్టల నరేష్‌ను పథకం ప్రకారం చంపిన ఘటనలో పినపాక మండలం ఉప్పాక గ్రామానికి చెందిన గద్దల సాంబశివరావు, అతనికి సహకరించిన ములుగు జిల్లాకు వెంకటాపురం గ్రామానికి చెందిన తాటి నరేష్, మృతుడి భార్య బుట్టల రజితను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మద్యం అలవాటు ఉన్న తన భర్తను ఎవరికి అనుమానం రాకుండా హతమార్చింది భార్య కానీ భర్త బుట్టల నరేష్ తెచ్చిన మద్యం సీసాలో ఉన్న మిగిలిన మందును తాగిన వ్యక్తి అనారోగ్యం పాలవ్వడంతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసుల రంగ ప్రవేశంతో విషయం అంతా బయటకు పొక్కింది.
