ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో గురువారం 35 ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్‌ను పదునైన కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. అతడిని అరెస్టు చేశారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో మాచి బజార్.. గురు రవిదాస్ మార్గ్, గోవింద్‌పురి నుండి ఈ సంఘటనకు సంబంధించి పిసిఆర్ కాల్ వచ్చిందని పోలీసు అధికారి చెప్పారు.

Wife Illicit Relationship Suspecting Husband Stabbed Bus Driver
ఆగ్నేయ ఢిల్లీ(Delhi)లోని గోవింద్‌పురి(Govindpuri) ప్రాంతంలో గురువారం 35 ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్‌ను పదునైన కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. అతడిని అరెస్టు చేశారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో మాచి బజార్.. గురు రవిదాస్ మార్గ్, గోవింద్‌పురి నుండి ఈ సంఘటనకు సంబంధించి పిసిఆర్ కాల్ వచ్చిందని పోలీసు అధికారి చెప్పారు. నవజీవన్ క్యాంపు(Navajeevan Camp)లో నివాసం ఉంటున్న నిందితుడు సోను(Sonu) అలియాస్ అనిల్(Anil) (33)ని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్న తన భార్యతో వీరేంద్ర(Veerendra) అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని సోను అనుమానించి.. మనస్తాపానికి గురయ్యాడు.
తీవ్రంగా గాయపడిన వీరేంద్రను మజీడియా ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ) రాజేష్ డియో(Rajesh Dio) మాట్లాడుతూ.. పోలీసులు ఆసుపత్రికి చేరుకోగా.. వీరేంద్ర చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని తెలిపారు. నవజీవన్ క్యాంప్ మురికివాడలో పోలీసులు సోనూను అరెస్టు(Arrest) చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం ఇంకా లభ్యం కాలేదని డీసీపీ(DCP) తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించామని.. తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
