✕
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో మద్యం మత్తులో ఉన్న 48 ఏళ్ల వ్యక్తిని అతని భార్య గొడ్డలితో నరికి చంపింది.

x
Wife axes 48-year-old man to death in Telangana
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో మద్యం మత్తులో ఉన్న 48 ఏళ్ల వ్యక్తిని అతని భార్య గొడ్డలితో నరికి చంపింది. మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగిన నక్క నాగయ్యను భార్య హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. గొడవతో కోపోద్రిక్తురాలైన నిందితురాలు పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకుని నాగయ్యపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Yagnik
Next Story