ఈరోజుల్లో యుగంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
ఈరోజుల్లో యుగంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. భారీ లాభాల పేరుతో ఆశజూపడం లేదా డిజిటల్ అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు లాగుతున్నారు. అయితే ఈ మోసాలకు సైబర్ నేరగాళ్లు
ఎక్కువగా మెసేజింగ్ ప్లాట్‌ఫాట్ ‘వాట్సాప్’(WhatsApp)నే వినియోగిస్తున్నాని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. వాట్సాప్ వేదికగా స్కామర్లు ఎక్కువగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత ఈ జాబితాలో టెలిగ్రామ్(Telegram), ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఉన్నట్లు పేర్కొంది. 2024 తొలి మూడు నెలల్లో వాట్సప్ వేదికగా జరిగిన మోసాలకు సంబంధించి 43,797 ఫిర్యాదులు వచ్చినట్లు ఆ నివేదికలో వెల్లడించింది. ఇక, టెలిగ్రామ్‌లో మోసాలపై 22,680, ఇన్‌స్టా వేదికగా జరిగే నేరాలపై 19,800 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించింది.ఈ తరహా మోసాల కట్టడి కోసం తాము చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. డిజిటల్ లెండింగ్ యాప్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆయా సామాజిక మాధ్యమాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.