ఓ యువ ఇంజినీర్‌కు ఓ యువతి ఆన్‌లైన్‌లో పరిచయమైంది. హలో, హాయ్‌ నుంచి హస్కీ వాయిస్‌లో మాట్లాడే వరకు వచ్చింది వ్యవహారం

ఓ యువ ఇంజినీర్‌కు ఓ యువతి ఆన్‌లైన్‌లో పరిచయమైంది. హలో, హాయ్‌ నుంచి హస్కీ వాయిస్‌లో మాట్లాడే వరకు వచ్చింది వ్యవహారం. చాటింగ్‌తో యువకుడిని ఆ యువతి కట్టిపడేసింది. నేరుగా ఏ రోజూ కలవకపోయినా వాయిస్ కాల్స్‌తో రెచ్చగొట్టేది. అమ్మాయికి పడిపోయిన యువకుడు పూర్తి ఆమె మైకంలో ఒదిగిపోయాడు. ఆపద అంటే ఆదుకున్నాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 లక్షల వరకు డబ్బు యువతి బ్యాంకు ఖాతాలో ధారపోశాడు. అయితే చివరికి ఎక్కడో కొట్టడంతో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడడంతో లబోదిబోమంటున్నాడు బాధితుడు.

విశాఖకు(vizag) చెందిన ఓ యువకుడు కార్ల కంపెనీలో క్వాలిటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి సోషల్‌ మీడియాలో ఓ అందమైన యువతి పరిచమైంది. తన పేరు సంయుక్త గౌడ్‌గా(samyuktha goud) చెప్పుకుంది. ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. అలా అలా చాటింగ్‌ నుంచి ఓ నెల తర్వాత ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడాలు, వాట్సాప్‌లో మాట్లాడుకోవాలు, వాయిస్‌ కాల్స్‌తో ఇద్దరి మధ్య మరింత క్లోజ్‌ నెస్ పెరిగింది. తన మాటలన్నీ నిజమేనని నమ్మాడు బాధితుడు. అందమైన ఫొటోలు తీసి పంపించి అవి తన ఫొటోలేనని నమ్మించేది. ఓ రోజు నేరుగా కలుద్దామంటే తర్వాత కలుద్దామని వాయిదా వేసింది. ఆమె మధురమైన గొంతు విని మరింత పడిపోయాడు. ఇరువురు కుటుంబాల గురించి, వ్యక్తిగత విషయాలన్నీ మాట్లాడుకునేవారు. యువకుడు కూడా పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని కమిట్‌ అయ్యాడు. అలా సాగుతున్న వారి ప్రేమాయణంలో ఓ రోజు యువతి తన వాయిస్‌ను కాస్త గద్గద స్వరం చేసింది. అది గుర్తించిన యువకుడు ఏం జరిగిందని అడగగా అమ్మకు ఆరోగ్యం బాలేదని తెలిపింది. కానీ చికిత్స చేసుకోవడానికి అంత డబ్బులేదని తెలిపింది. అది నమ్మిన యువకుడు ఆ యువతికి డబ్బులు పంపాడు. ఆ తర్వాత మన కోసం సైట్‌ కొందామని, అందుకు కొంత డబ్బు కావాలని అడిగింది. అప్పుడు కూడా కొంత అమౌంట్ పంపించాడు. ఆ తర్వాత తనకు ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని వాడిని వదిలించుకుంటున్నాని మరికొంత డబ్బు కావాలని కోరింది. అప్పుడు కూడా కొంత డబ్బు పంపించాడు. అలా దాదాపు 28 లక్షల(28 Lakhs) డబ్బు యువతి ఖాతాలోకి వెళ్లిపోయింది.

అంతా అయిపోయాక తెలివివచ్చినట్లు.. యువకుడికి అనుమానం కలిగి సైబర్‌క్రైం(cyber crime) పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ట్రేస్‌ చేయగా హైదరాబాద్‌లో(Hyderabad) ఉందని తేలింది. హైదరాబాద్‌ వెళ్లిన పోలీసులు వారం పాటు యువతి కోసం మాటు వేశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న సెల్‌ఫోన్‌ నెంబర్‌ తీసుకొని లొకేషన్‌ ట్రేస్‌ చేయగా యువకుడు పట్టుబడ్డాడు. యువకుడు నల్గొండ జిల్లా (nalgonda District)నార్కెట్‌పల్లికి(Narket Palii) చెందిన లోకేష్‌గా(lokesh) గుర్తించారు. లోకేష్‌ డిగ్రీ డిస్ కంటిన్యూ చేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఇతనికి సాయిధీరజ్‌(Sai Deeraj) అనే మరో యువకుడు సహకరించారు. సంయుక్త గౌడ్‌ అనే పేరుతో ఇన్‌స్టాలో ఖాతా ఓపెన్‌ చేసి అందమైన ఫొటోలను అప్‌లోడ్‌ చేసేవాడు. ఇలా ఇతడి విశాఖ యువకుడు పడ్డాడు. సంయుక్త గౌడ్‌ పేరుతో ఆ యువకుడితో చాటింగ్ చేసేవాడు. లోకేష్ లేని సమయంలో ధీరజ్‌ చాటింగ్ చేసేవాడు. అయితే బాధితుడు వాయిస్‌ కాల్‌ మాట్లాడాలని కోరగా లోకేష్‌కు పరిచయం ఉన్న శాలిని(Shalini) అనే యువతితో ఫోన్‌ చేయించేవాడు. తన హస్కీ వాయిస్‌తో బాధితుడిని యువతి పడేసింది. అలా యువకుడిని 28 లక్షల సొమ్ము కాజేశారు.

28 లక్షల్లో ఆరు లక్షలతో ఓ బైక్‌ కొన్నాడు లోకేష్‌. రెండు గ్రాముల బంగారం, ఓ ఐఫోన్‌(Iphone)కూడా కొన్నాడు. మిగిలిన దాంట్లో కొంత శాలినికి కూడా ఇచ్చి ఆ మొత్తం సాయిధీరజ్‌ కొట్టేశాడు. లోకేష్‌ను అరెస్టు చేయడంతో పాటు బైక్, బంగారం, ఐ ఫోన్‌ను సీజ్‌ చేశారు. పోలీసులు. సాయిధీరజ్, శాలిని పరారీలో ఉన్నారు. ఇంత వరకు తాను చాట్‌ చేసింది మగవారితోనా అని యువకుడు ఆశ్చర్యపోయాడు. తాను మోసపోయానని గ్రహించాడు. దీంతో పోలీసులు అమ్మాయిల పేర్లు, ఫొటోలతో చాటింగ్‌ చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, అసలు డబ్బు విషయం వచ్చినప్పుడు వెంటనే ఇవ్వకూడదని, డబ్బు అడుగుతున్నారంటేనే ఏదో మోసం ఉండే ఉంటుందనే విషయాన్ని గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ehatv

ehatv

Next Story