ఇదో తండ్రి వ్యధాభరిత గాథ. ఆస్తులు పంచుకుంటున్నట్టు కొడుకులు తనను పంచుకోవడాన్ని తట్టుకోలేకపోయాడా అయిదుగురు బిడ్డల తండ్రి. సొంత ఊరిని వదిలిపెట్టి మరో ఊరికి వెళ్లడానికి ఆయన మనసు అంగీకరించలేదు. ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చితి పేర్చుకుని అందులో దూకి చనిపోయాడు. గుండెలను పిండేసే ఈ ఘటన సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగింది.
ఇదో తండ్రి వ్యధాభరిత గాథ. ఆస్తులు(assests) పంచుకుంటున్నట్టు కొడుకులు తనను పంచుకోవడాన్ని తట్టుకోలేకపోయాడా అయిదుగురు బిడ్డల తండ్రి. సొంత ఊరిని వదిలిపెట్టి మరో ఊరికి వెళ్లడానికి ఆయన మనసు అంగీకరించలేదు. ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చితి పేర్చుకుని అందులో దూకి చనిపోయాడు. గుండెలను పిండేసే ఈ ఘటన సిద్ధిపేట(siddipet) జిల్లా హుస్నాబాద్(Husnabad)మండలం పొట్లపల్లిలో(Potlapally) జరిగింది. 90 ఏళ్ల మేడబోయిన వెంకటయ్యకు(Venkataiha) నలుగురు కొడుకులు, ఒక కూతురు. కుమారుల్లో ఒ ఇద్దరు పొట్లపల్లిలో నివసిస్తుంటే, ఒకరు హుస్నాబాద్‌లో, ఇంకొకరు కరీంనగర్‌జిల్లా(karimnagar) చిగురుమామిడి మండలం నవాబుపేటలో ఉంటున్నారు. వెంకటయ్య భార్య చనిపోయిన తర్వాత తనకున్న నాలుగు ఎకరాల భూమిని కొడుకులకు పంచేశాడు. వారంతా వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు.
వెంకటయ్యు వృద్ధాప్య పింఛను వస్తున్నది కానీ అది ఆయన బతకడానికి సరిపోవడం లేదు. పోట్లపల్లిలో ఉన్న పెద్ద కొడుకు కనకయ్య దగ్గరే ఉండేవాడు వెంకటయ్య. అయిదు నెలల కిందట వెంకటయ్యను ఎవరు పోషించాలన్న దానిపై పంచాయితీ జరిగింది. నెలకు ఒకరు చొప్పున నలుగురు కొడుకులు వంతులవారీగా పోషించాలని పెద్దమనుషులు చెప్పారు. కనకయ్య వంతు పూర్తి కావడంతో నవాబుపేటలో ఉంటున్న కొడుకు దగ్గరకు వెళ్లవలసి వచ్చింది. కన్న ఊరును, సొంత ఇంటిని వదిలిపెట్టి వెళ్లడం ఇయనకు ఇష్టం లేదు. మొన్న 2వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన వెంకటయ్య ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు. రాత్రి అక్కడ ఉండి 3వ తేదీ ఉయం నవాబుపేటకు వెళతానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు నవాబుపేటకు వెళ్లలేదు. అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. 4వ తేదీ మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మగుట్ట దగ్గర మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనిపించింది. అది వెంకటయ్యదేనని కుటుంబసభ్యులు గుర్తించారు. తాటికమ్మలను ఒక చోట కుప్పగా వేసి వాటికి నిప్పుపెట్టి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు వెంకటయ్య.