ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) గ్యాంగ్‌స్టర్, రాజకీయనాయకుడు అతీక్ అహ్మద్(Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్‌ల(Ashraf) అంత్యక్రియలు ముగిశాయి. అతడి స్వస్థలం ప్రయాగ్‌రాజ్‌లోని(Prayagraj) కసారి మసారి స్మశాన వాటికలో అన్నదమ్ములిద్దరిని ఖననం చేశారు. భారీ బందోబస్తు మధ్య, కుటుంబసభ్యుల సమక్షంలో అతీక్ అంతిమయాత్ర సాగింది
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) గ్యాంగ్‌స్టర్, రాజకీయనాయకుడు అతీక్ అహ్మద్(Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్‌ల(Ashraf) అంత్యక్రియలు ముగిశాయి. అతడి స్వస్థలం ప్రయాగ్‌రాజ్‌లోని(Prayagraj) కసారి మసారి స్మశాన వాటికలో అన్నదమ్ములిద్దరిని ఖననం చేశారు. భారీ బందోబస్తు మధ్య, కుటుంబసభ్యుల సమక్షంలో అతీక్ అంతిమయాత్ర సాగింది. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రతీ గల్లీలోనూ పోలీసు, ఆర్‌ఎఎప్, సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరింపచేశారు. అతీక్ కొడుకు అసద్‌ను ఖననం చేసింది ఈ స్మశానంలోనే. అతీక్ తల్లిదండ్రుల సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి.
అతీక్, అష్రఫ్ లను చంపేందుకు నిందితులు తుర్కియేకు చెందిన టిసాస్ కంపెనీ తయారు చేసిన సెమీ-ఆటోమేటిక్ జిగాన (Zigana) పిస్టల్‌ను వాడారని పోలీసులు చెబుతున్నారు. తుర్కియేలో పాలిమర్ ఫ్రేమ్‌తో తయారైన తొలి పిస్తోల్ ఇదే. ఒక్కో పిస్టోల్ మన కరెన్సీలో ఆరేడు లక్షల రూపాయలు ఉంటుంది. తుర్కియేకు చెందిన సైన్యం, ప్రత్యేక దళాలు, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ తుపాకులను వాడుతున్నాయి. భారత్‌లో వీటిపై నిషేధం ఉంది. పాకిస్థాన్ నుంచి వీటిని మన దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ తుర్కియో పిస్టల్స్ డూప్లికేట్లను పాకిస్తాన్ తయారు చేస్తోంది. ఇంచుమించు జిగాన పిస్టల్‌లాగే ఇవి ఉంటాయి కానీ రేటు మాత్రం తక్కువ. పాకిస్తాన్‌లోని గన్ వ్యాలీగా పేరుగాంచిన దర్రా ఆదమ్ ఖేల్ అనే ప్రాంతంలో రెండు వేలకు పైగా ఆయుధాల దుకాణాలున్నాయి. నిందితులు జిగాన పిస్టోల్స్‌ను వాడటం పలు అనుమానాలను కలిగిస్తోంది. ఇంత ఖరీదైన తుపాకులు కొనేందుకు వారికి డబ్బు ఎక్కడిది? ఎవరు ఇచ్చారు? అనేది పోలీసులు విచారిస్తున్నారు.
అతీక్, అష్రఫ్‌లను హత్య చేసిన ముగ్గురు హంతకుల్లో సన్నీ ఒకడు. ఇతడిని పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సుందర్ భాటితో సంబంధాలు ఉన్నాయట. జిగాన తుపాకులు అతడే సప్లై చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతంబుద్ధానగర్ జిల్లా గంఘెలా గ్రామానికి చెందిన భాటి పలు కేసుల్లో నిందితుడు. ఇతడిపై 60కి పైగా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఓ హత్య కేసులో సోనభద్ర జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. ఏడాదిన్నర కిందట సుందర్ హమీర్‌పూర్ జైలులో సుందర్‌తో సన్నీకి పరిచయం ఏర్పడింది. ఆ విధంగా సుందర్‌భాటి గ్యాంగులో సన్నీ చేరాడు. సన్నీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా భాటి మనుషులను కలుస్తుండేవాడు. భాటి దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయన్నది పోలీసుల అనుమానం. కాకపోతే అతీక్‌తో భాటికి విరోధమేమీ లేదు. మరి అతడిని చంపేందుకు తుపాకులు ఎందుకు తుపాకులు ఇస్తాడు? ఏ ప్రయోజనం ఆశించి సన్నీకి తుపాకులు సప్లై చేశాడు? ఇవి తెలవాల్సి ఉంది.