Surgical Robot : ప్రాణాలు తీసిన సర్జికల్ రోబో.. కోర్టును ఆశ్రయించిన బాధిత కుటుంబం
రోబోలు(Robo) గొప్పవే కావచ్చు. కానీ వాటిని సృష్టించిన మనిషి ఇంకా గొప్పోడు! మనుషుల స్థానాన్ని రోబోలు భర్తీ చేయగలవని, భవిష్యత్తు అంతా రోబోలదేనని చెప్పుకుంటారు. కానీ ఇది పాక్షిక సత్యమే. మనుషులు చేసినట్టు రోబోలు చేయలేవు. ఈ సంగతి మరోసారి రుజువయ్యింది. అమెరికాలో(America) డాక్టర్లు ఓ సర్జికల్ రోబో(Surgical Robo) సాయంతో నిర్వహించిన పెద్ద పేగు కేన్సర్ ఆపరేషన్(Bowel cancer operation) వికటిచింది. తన భార్య సాండ్రా సుల్జర్ చిన్న పేగుకు సర్జికల్ రోబో రంధ్రాలు చేసిందని, ఇది ఆమె మరణానికి దారి తీసిందని హార్వే సుల్జర్ అక్కడి కోర్టులో పిటిషన్ వేశాడు.
రోబోలు(Robo) గొప్పవే కావచ్చు. కానీ వాటిని సృష్టించిన మనిషి ఇంకా గొప్పోడు! మనుషుల స్థానాన్ని రోబోలు భర్తీ చేయగలవని, భవిష్యత్తు అంతా రోబోలదేనని చెప్పుకుంటారు. కానీ ఇది పాక్షిక సత్యమే. మనుషులు చేసినట్టు రోబోలు చేయలేవు. ఈ సంగతి మరోసారి రుజువయ్యింది. అమెరికాలో(America) డాక్టర్లు ఓ సర్జికల్ రోబో(Surgical Robo) సాయంతో నిర్వహించిన పెద్ద పేగు కేన్సర్ ఆపరేషన్(Bowel cancer operation) వికటిచింది. తన భార్య సాండ్రా సుల్జర్ చిన్న పేగుకు సర్జికల్ రోబో రంధ్రాలు చేసిందని, ఇది ఆమె మరణానికి దారి తీసిందని హార్వే సుల్జర్ అక్కడి కోర్టులో పిటిషన్ వేశాడు. సర్జికల్ రోబోను విక్రయిస్తున్న ఇంట్యూటివ్ సర్జికల్ సంస్థ 75 వేల డాలర్లు, మన కరెన్సీలో చెప్పాలంటే ఇంచుమించు 62.26 లక్షల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఫిబ్రవరి 6వ తేదీన ఇంట్యూటివ్ సర్జికల్ అనే కంపెనీపై కోర్టులో కేసు వేశాడు హార్వే సుల్జర్ . 2021 సెప్టెంబర్‌లో ఫ్లోరిడాలోని బాప్టిస్ట్ హెల్త్ బోకా రాటన్ రీజినల్ ఆసుపత్రిలో సాండ్రా సుల్జర్ పెద్ద పేగుకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. రిమోట్‌తో పనిచేసే డా విన్సీ అనే సర్జికల్ రోబోను వైద్యులు ఆపరేషన్‌లో వినియోగించారు. రోబో వల్ల ఆమె చిన్న పేగుకు రంధ్రాలు అయ్యాయి. ఆపరేషన్ తదనంతరం ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. 2022 ఫిబ్రవరిలో కన్నుమూసింది. ఆపరేషన్ సమయంలో అంతర్గత అవయవాలను రోబో దెబ్బతీస్తున్న సంగతి కంపెనీకి ముందే తెలుసునని, ఈ సంగతి కుటుంబ సభ్యులకు చెప్పలేదని హార్వే ఆరోపిస్తున్నారు. రోబోతో ఏర్పడిన గాయాలు, లోపాల గురించి కంపెనీకి వేలాది నివేదికలు అందాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ను కంపెనీ తప్పుదారి పట్టించిందని దావాలో పేర్కొన్నారు. డా విన్సీ రోబో వాడకంపై వైద్యులకు తగిన శిక్షణ ఇవ్వడంలో సంస్థ విఫలమైందని, అనుభవం లేని ఆసుపత్రులకు రోబోలను విక్రయించిందని ఆయన ఆరోపించారు.