రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ శ్రీశైలం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.

Two killed in Ranga Reddy district road accident
రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మహేశ్వరం(Maheshwaram) మండలంలోని తుక్కుగూడ(Thukkuguda) శ్రీశైలం జాతీయ రహదారి(Srishailam National Highway)పై ప్రమాదం జరిగింది. తుక్కుగూడ వైపు నుండి హైదరాబాద్(Hyderabad) వైపు వెళ్తున్న కారు(Car).. బైకు(Bike)ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బైక్‌పై వెళుతున్న ముగ్గురిలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
మహేశ్వరం మండలంలోని మంకల్ పారిశ్రామిక వాడలో ఉన్న శ్రీనాథ్ రోటో ప్యాక్‌లో మృతుడు పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో సత్య జీత్(Sathyajith) అనే వ్యక్తి మృతి చెందారు. వీరంతా ఒరిస్సా(Odisha) రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు(Police) పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ పుటేజ్(CCTV Footage)ను ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
