ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్నదమ్ములు కాశీకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్నదమ్ములు కాశీకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఏలూరు(Eluru)జిల్లా ఉంగుటూరు(unguturu) మండలం నారాయణపురానికి చెందిన అన్నదమ్ముల పేర్లు లక్ష్మీనారాయణ(Laxminarayana) (34), వినోద్‌(Vinod) (32). వీరిద్దరు ఏప్రిల్‌ నెలలో ఇంట్లోంచి వెళ్లిపోయారు. వీరి కోసం చాలా రోజులు వెతికారు. బంధువులు, స్నేహితులు, తెలిసినవారిని అందరినీ అడిగారు. అన్నదమ్ముల జాడ తెలియకపోయేసరికి మే మాసంలో చేబ్రోలు పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్(Real Estate), ఫైనాన్స్ వ్యాపారం చేసే అన్నదమ్ములు ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి.. కానీ, వారణాసి(Varanasi)లోని ఆంధ్ర ఆశ్రమం(Andhra Ashramam)లో గదిని అద్దెకు తీసుకున్న అన్నదమ్ములు అందులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల సెల్ ఫోన్ లో మొబైల్ నెంబర్ల ఆధారంగా నారాయణపురం(Narayanapuram)లో బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంట్లోంచి వెళ్లిపోయిన సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు బెదిరిస్తున్నారని, తమకు ఆత్మహత్యే శరణ్యమని సెల్ఫీ వీడియోలు పంపారు అన్నదమ్ములు.

ehatv

ehatv

Next Story