పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి వేళ ముగ్గురిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది

Triple Murder In Palnadu
పల్నాడు జిల్లా(Palnadu District)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిడుగురాళ్ల(Piduguralla) మండలం కోనంకి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి వేళ ముగ్గురిని దారుణంగా హత్య(Murder) చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో సమీప బంధువులు ఒకే కుటుంబానికి చెందిన తండ్రి అనంత సాంబశివరావు(Anantha Sambashiva Rao)(50), తల్లి అది లక్ష్మి(Adhilakshmi)(47), కొడుకు నరేష్(Naresh)(30) అనే ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికిన చంపారు. సమాచారం అందుకున్న పిడుగురాళ్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కోడలు మాధురితో సహా నిందితులు ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పిడుగురాళ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
