సోషల్ మీడియాలో అపరిచితులతో ఫ్రెండ్‌షిప్‌ మహా డేంజర్‌. అందరూ ప్రమాదకారులని కాదు కానీ సామాజిక మాధ్యమాలలో స్నేహం చేసేటప్పుడు అవతలివారు ఎలాంటి వారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాగే హైదరాబాద్‌ బొల్లారం ప్రాంతానికి చెందిన యువతి ముక్కు మొహం తెలియని వాడితో ఫ్రెండ్‌ షిప్‌ చేసి తీవ్రంగా నష్టపోయింది. దాన్ని స్నేహం అనాలో ప్రేమ అనాలో తెలియడం లేదు. ఈ ఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది.

సోషల్ మీడియా(Social Media)లో అపరిచితులతో ఫ్రెండ్‌షిప్‌ మహా డేంజర్‌. అందరూ ప్రమాదకారులని కాదు కానీ సామాజిక మాధ్యమాలలో స్నేహం చేసేటప్పుడు అవతలివారు ఎలాంటి వారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాగే హైదరాబాద్‌(Hyderabad) బొల్లారం ప్రాంతానికి చెందిన యువతి ముక్కు మొహం తెలియని వాడితో ఫ్రెండ్‌ షిప్‌ చేసి తీవ్రంగా నష్టపోయింది. దాన్ని స్నేహం అనాలో ప్రేమ అనాలో తెలియడం లేదు. ఈ ఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. బొల్లారంలో ఉండే ఓ యువతి నారాయణగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. ఆమెకి ఏడు నెలల కిందట ఇన్‌స్టాగ్రామ్‌ లో పూర్ణేశ్‌ యాదవ్‌ పరిచయం అయ్యాడు. పూర్ణేశ్‌ చెన్నైలో బీటెక్‌ ఫైనల్ ఇయర్‌ చదువుతున్నాడు. ఫ్రెండ్‌ షిప్‌ కాస్తా ప్రేమగా మారింది. చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామని పూర్ణేశ్‌ ప్రామిస్‌ చేశాడు. యువతి చదువుతున్న కాలేజీలోనే ఆస్లాం చదువుతున్నాడు. ఆమెకు క్లాస్‌మెట్‌ కూడా! పైగా ఇతన పూర్ణేశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యూచువల్‌ ఫ్రెండ్‌.

నెల రోజుల కిందట ఆ యువతికి పూర్ణేశ్ ఫోన్‌ చేశాడు. అర్జెంట్‌గా డబ్బు కావాలని అడిగాడు. ప్రస్తుతం తన దగ్గర డబ్బుల్లేవని సమాధానం ఇచ్చింది. అస్లాంను అడిగి ఇవ్వమని సలహా ఇచ్చాడు పూర్ణేశ్‌. అతడు చెప్పినట్టుగానే అస్లాంను డబ్బులు అడిగింది. తన దగ్గర అంత అమౌంట్‌ లేదని, తన ఫ్రెండ్‌ సాయిచరణ్‌ ఫైనాన్స్‌ బిజినెస్‌ చేస్తుంటాడని, అతడు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాడని ఆమెతో చెప్పాడు. కాకపోతే అతడితో ఏకాంతంగా గడపాల్సి ఉంటుందని కండిషన్‌ పెట్టాడు అస్లాం. దీనికి ఆ యువతి అంగీకరించింది. గత నెల 23వ తేదీన నారాయణగూడ విఠల్‌వాడిలోని ఓయో రూమ్‌లో సాయిచరణ్‌తో ఆ యువతి గడిపింది. ఆ గదిలో ముందుగానే దాక్కున్న అస్లాం ఆ వ్యవహారాన్ని సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. సాయిచరణ్‌తో యువతి న్యూడ్‌గా ఉన్న దృశ్యాలను వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోను ఆ యువతికి పంపించాడు. తనతో గడిపితేనే వీడియోలు డిలీట్‌ చేస్తానని, లేకపోతే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆ వీడియోలను తన ఫ్రెండ్‌ పూర్ణేశ్‌కు కూడా పంపించాడు. అతడు కూడా యువతిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోను సోషల్‌ మీడియాలో పెడతానన్నాడు. తన దగ్గర అంత డబ్బు లేదని యువతి కన్నీటితో చెప్పుకుంది. అయినా అతడు కరగలేదు. ఆ వీడియోను ఆమె కుటుంబసభ్యులలో ఒకరికి, ఫ్రెండ్స్‌కు పంపించాడు. దీంతో బాధితురాలు ధైర్యంగా షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. ముగ్గురిపై ఫిర్యాదు చేసింది. యువతి కంప్లయింట్‌ను స్వీకరించిన షీ టీమ్స్‌ కేసు ఫైల్‌ చేశారు. సాయిచరణ్‌, అస్లామ్‌ విచారణ రావాలని 41 సీఆర్పీసీ కింద బుధవారం నోటీసులు జారీ చేశారు. అస్లామ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. చెన్నైలో ఉండే పూర్ణేశ్‌ యాదవ్‌కు సైతం నోటీసులు ఇస్తామని పోలీసులు చెప్పారు.

Updated On 9 Jun 2023 2:40 AM GMT
Ehatv

Ehatv

Next Story