ఏడాది చివరి రోజు వారి జీవితానాకి కూడా చివరి రోజు అవుతుందని ఊహించనేలేదు. అతివేగం ముగ్గురు ప్రాణాలను బలికొన్నది.

ఏడాది చివరి రోజు వారి జీవితానాకి కూడా చివరి రోజు అవుతుందని ఊహించనేలేదు. అతివేగం ముగ్గురు ప్రాణాలను బలికొన్నది. ప్రమాదం జరిగిన స్థలంలోనే ఒకరు చనిపోగా మరో ఇద్దరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

పులివెందుల నియోజకవర్గంలోని వేముల, పులివెందుల ప్రాంతానికి చెందిన ఏడుగురు స్నేహితులు డిసెంబర్ 31 వేడుకల కోసం పర్యాటక కేంద్రమైన గండికోటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లింగాల మండలం పెద్దకుడాలకు చెందిన అబ్దుల్, పులివెందులకు చెందిన జగన్, షాహుల్‌, వేముల మండలం భూమయ్యగారిపల్లికి చెందిన నందీష్‌, సింహాద్రిపురం అగ్రహారానికి చెందిన చైతన్య, ప్రేమ్, షాజహాన్ ఉన్నారు. వీరు ప్రయాణిస్తునర్న క్రమంలో ముద్దనూరు కొండ దిగిన తర్వాత చిటిమిటి చింతల గ్రామానికి సమీపంలో ఉన్న దర్గా మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న స్కార్పియోను అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నందీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. లింగాల మండలం పెద్ద కుడాల గ్రామానికి చెందిన అబ్దుల్‌ను జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. పులివెందులకు చెందిన జగన్ పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. షాహుల్, చైతన్య, ప్రేం, షాజహాన్ జమ్మలమడుగు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story