తూర్పుగోదావరి(East Godhavari) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోరుకొండ(Korukonda) మండల కేంద్రంలో కారు అదుపుతప్పి కాలువలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉండగా.. వీరిలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ముగ్గురిలో ఒకరి మృతదేహం లభ్యమవగా.. మిగతా ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తూర్పుగోదావరి(East Godhavari) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోరుకొండ(Korukonda) మండల కేంద్రంలో కారు అదుపుతప్పి కాలువలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉండగా.. వీరిలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ముగ్గురిలో ఒకరి మృతదేహం లభ్యమవగా.. మిగతా ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన కారులో ఉన్న ఆరుగురు యువకులు ఏలూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా సమాచారం.
కోరుకొండ మండలం బూరుగుపూడి అయ్యెనగల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి నుంచి ఏలూరు వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు క్రేన్ సహాయంతో కాలువలో నుంచి కారుని బయటికి తీశారు.
ఏపీ 39 హెచ్ఆర్ 0907 నెంబర్ గల బలేనో కారు రాత్రి 11:30 ప్రాంతంలో అదుపు తప్పి బురుగుపుడి గేట్ వద్ద వున్న బ్రిడ్జి క్రింద పడిపొయినట్లు పోలీసులు తెలిపారు. కారులో ఆరుగురు యువకులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.