హైదరాబాద్ ముషీరాబాద్ లోని గంగపుత్ర కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల కూతురిని చంపి ఆపై దంపతులు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
హైదరాబాద్(Hyderabad) ముషీరాబాద్(Musheerabad) లోని గంగపుత్ర కాలనీ(Gangaputhra Colony)లో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల కూతురిని చంపి ఆపై దంపతులు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. అయితే ఆత్మహత్యకు ముందు ఇంట్లో గోడపై సూసైడ్ నోట్(Suicide Note) రాశారు. మృతులను ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని కర్నూలు(Kurnool) జిల్లా లక్ష్మీపురం(Lakshmipuram)కు చెందిన సురేష్ బాబు(Suresh), చిత్రలేఖ(Chithralekha) దంపతులుగా గుర్తించారు. వీరి నాలుగేళ్ల కూతురు తేజస్విని(Tejaswini). చిత్రలేఖ బిర్లా సైన్స్ సెంటర్(Birla Science Center)లో పనిచేస్తుండగా.. ఉద్యోగంలో వేధింపులే చావుకు కారణమని పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తమ చావుకి కారణం బిర్లా సైన్స్ సెంటర్‌లో వర్క్ చేస్తున్న శ్యామ్ కొఠారి, గీత రావులు కారణం అంటూ ఇంట్లో గోడపై మృతురాలు చిత్రలేఖ సూసైడ్ నోట్ రాసింది. ఆమె అక్కడ పని చేస్తున్నప్పుడు ఆమెపై తప్పుడు ఆరోపణలు చేసి జాబ్ నుండి తొలిగించారని సూసైడ్ నోట్‌లో ఉంది. అపాయింట్మెంట్ లెటర్, పే స్లిప్స్ అడిగినా పట్టించుకోలేదని.. వాళ్ళు చేస్తున్న మోసాన్ని నిలదీసినందుకు తనను ఉద్యోగం నుండి తొలిగించారని సూసైడ్ నోట్‌లో చిత్రలేఖ పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కు ఎన్నో సార్లు ట్విట్టర్ లో మొర పెట్టుకున్నా ఆయన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సూసైడ్ నోట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.