ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాక్టర్ ట్రాలీ, బొలెరో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఒక మ‌హిళ‌కు తీవ్ర‌గాయ‌ల‌య్యాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. మ‌హిళ‌ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం మేరకు.. శనివారం రాత్రి 11 గంటల సమయంలో లక్నో నుంచి వస్తున్న బొలెరో వాహనం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది.

ఉత్తరప్రదేశ్‌(Uttarprdesh)లోని అజంగఢ్(Azamgarh) జిల్లాలో ఘోర ప్రమాదం(Accident) జరిగింది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే(Purvanchal Expressway)పై ట్రాక్టర్ ట్రాలీ(Tractor-Trolley), బొలెరో(Bolero ) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఒక మ‌హిళ‌కు తీవ్ర‌గాయ‌ల‌య్యాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. మ‌హిళ‌ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం మేరకు.. శనివారం రాత్రి 11 గంటల సమయంలో లక్నో నుంచి వస్తున్న బొలెరో వాహనం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా ఆసుపత్రికి త‌ర‌లించ‌గా.. అక్కడి నుంచి వారణాసికి రెఫర్ చేశారు.

ఏఎస్పీ సిటీ శైలేంద్ర లాల్(Shailendra Lal) తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 11.30 గంటలకు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై అహ్రాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదరంపూర్ గ్రామ సమీపంలో లక్నో నుంచి ఘాజీపూర్ వెళ్తున్న బొలెరో ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో వెళ్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో కిరణ్(Kiran) అనే మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే జిల్లా ఆసుపత్రికి పంపారు. అక్కడి నుంచి వారణాసి(Varanasi)కి రెఫర్ చేశారు. అందరూ డియోరియా(Deoria) జిల్లా వాసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై పోలీసులు బంధువులకు సమాచారం అందించారు.

Updated On 29 April 2023 10:49 PM GMT
Yagnik

Yagnik

Next Story