బెంగళూరులో 37 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారిని అతని భార్య, అత్త హత్య చేశారని పోలీసులు సోమవారం తెలిపారు.

బెంగళూరులో 37 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారిని అతని భార్య, అత్త హత్య చేశారని పోలీసులు సోమవారం తెలిపారు. పోలీసుల ప్రకారం, చిక్కబనవరలోని ఒక మారుమూల ప్రాంతంలో ఓ కారులో బాధితుడు లోక్‌నాథ్ సింగ్(Loknath Singh) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. విచారణ చేయగా హత్యకు పాల్పడిన 19 ఏళ్ల యశస్విని సింగ్, 37 ఏళ్ల హేమా బాయి అనే ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు మొదట బాధితుడికి మత్తుమందులు కలిపి ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వారు అతన్ని ఏకాంత ప్రదేశానికి తరలించి, అక్కడ కత్తితో గొంతు కోసి పారిపోయారు. బాధితుడికి వివాహేతర సంబంధాలు, అక్రమ వ్యాపార లావాదేవీలు హత్యకు కారణాలని పోలీసులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 2023 నుండి, లోక్‌నాథ్‌ తనను పెళ్లి చేసుకోవాలని యశస్విని (Yashaswini)బెదిరిస్తూ.. కుటుంబ సభ్యులనుబ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది. లోక్‌నాథ్ నాలుగు నెలల క్రితం యశస్వినిని ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నాడు. వారి వివాహం తర్వాత, అతను ఆమెను వేధించడం ప్రారంభించాడు.

తనతో విచ్చలవిడి సెక్స్‌ను కోరుకున్నాడు. ఆమె వాటిని తిరస్కరించింది. దీంతో యశస్వినిపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా యశస్విని తల్లిని తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. చివరికి ఆమె అతన్ని వదిలి తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. అయితే, లోక్‌నాథ్ తిరిగి వచ్చి ఆమె తండ్రి కృష్ణ సింగ్‌(Krishna Singh)తో సహా కుటుంబాన్ని బెదిరించాడు. ఆమె తనతో కలిసి నివసించడానికి తిరిగి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఇదంతా భరించలేని యశస్విని, ఆమె తల్లితో కలిసి తన హత్యకు ప్రణాళిక వేసుకున్నారు.

లోక్‌నాథ్ యశస్వినికి ఫోన్ చేసి తనని కలిసేందుకు వస్తున్నానని చెప్పాడు. కూతురు-తల్లి ఇద్దరూ ఆహారంలో నిద్ర మాత్రలు కలిపారు. యశస్వినితో పార్టీ చేసుకోవాలని ఆశతో లోక్‌నాథ్ కొన్ని బీర్లను తీసుకొచ్చాడు. యశస్విని తెచ్చిన ఆహారాన్ని తీసుకున్న తర్వాత మత్తులోకి వెళ్లిపోయాడు. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో అతని మెడపై రెండుసార్లు పొడిచింది యశస్విని తల్లి. లోకనాథ్ పారిపోవడానికి ప్రయత్నించి 150 మీటర్లు పరిగెత్తి ఆటో రిక్షాలో దాక్కోవడానికి ప్రయత్నించాడు. అతని అరుపులు విన్న ప్రయాణీకులు సంఘటనా స్థలానికి చేరుకుని, అతను చనిపోయి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated On 25 March 2025 11:00 AM GMT
ehatv

ehatv

Next Story