తెలుగు సినిమాలలో మేకప్ మ్యాన్ గా పనిచేస్తున్న ఓ యువకుడు

తెలుగు సినిమాలలో మేకప్ మ్యాన్ గా పనిచేస్తున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ బోరబండ పరిధిలో ఓ యువకుడి హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. కార్మిక నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న మైదానంలో రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతని కార్మిక నగర్లో నిర్మానుష్య ప్రాంతాన్నికి తీసుకొని వెళ్ళి హత్య చేసినట్టు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బోరబండ వెంకటగిరి ప్రాంతానికి చెందిన చుక్క చెన్నయ్య (30) మృతదేహం బోరబండ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో లభ్యమైంది. పదునైన ఆయుధాలతో చెన్నయ్యను పొడిచి చంపారు దుండగులు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. చెన్నయ్యను కాంటాక్ట్ చేసిన వ్యక్తుల గురించి తెలుసుకునే పనిలో పడ్డారు.

Updated On 15 May 2024 11:30 PM GMT
Yagnik

Yagnik

Next Story