జోగులాంబ గద్వాల్ జిల్లా జమ్మిచేడు సమీపంలో శుక్రవారం జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.

Three killed as car hits divider in Jogulama Gadwal
జోగులాంబ గద్వాల్(Jogulamba Gadwa) జిల్లా జమ్మిచేడు(Jammichedu) సమీపంలో శుక్రవారం జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కారు డివైడర్(divider)ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను నరేష్ (23), పవన్ కుమార్ (28), ఆంజనేయులు (50)గా గుర్తించారు. గద్వాల పట్టణానికి చెందిన ఓ వైద్యుడి కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి ఎర్రవల్లి(Erravalli)కి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. వీరంతా గద్వాలలోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగులు. ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు వెంటనే సమచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
