ఘటనా స్థలం నుండి వచ్చిన విజువల్స్‌లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది.

జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో ముగ్గురు అక్కా చెల్లెల్లు సజీవదహనమయ్యారు. రాంబన్ జిల్లాలోని తన్మస్తా తజ్నిహాల్ గ్రామంలోని ఓ ఇంటిలో సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో అదే సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు బాలికలు బిస్మా(18), సానియా(11), సైక(14)లు సజీవదహనమయ్యారు. నిద్రలో ఉన్నందువల్ల వారు బయటకు రాలేక పోయారని, దీంతో ఇంట్లోనే చిక్కుకుని మరణించారని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాలను బయటకు తీశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఆదివారం రాత్రి మూడు అంతస్తుల ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుండి వచ్చిన విజువల్స్‌లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. డిప్యూటీ కమిషనర్ (డిసి), రాంబన్, బసీర్ ఉల్ హక్ చౌదరి "రాంబన్ జిల్లాలోని ఉఖ్రాల్ బ్లాక్‌లోని మూడు అంతస్తుల ఇంట్లో ఆదివారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు." అని తెలిపారు. మృతదేహాలకు సంబంధించి పోస్టుమార్టం జరుగుతోందని అధికారులు తెలిపారు.

Updated On 12 Feb 2024 12:13 AM GMT
Yagnik

Yagnik

Next Story