అమెరికా(America)లో తుపాకీ మోతలు మళ్లీ వినిపించాయి. టేనస్సీ స్టేజ్‌ రాజధాని నాష్‌విల్లేలోని ఓ ప్రైవేటు ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ ఘోరం జరిగింది. నాష్‌విల్లే(Nashville)కు చెందిన 28 ఏళ్ల ఆడ్రీ హేల్‌(Audrey Hale) అనే మహిళ జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. చనిపోయినవారిలో తొమ్మిదేళ్లలోపు పిల్లలు ముగ్గురున్నారు. మిగతా ముగ్గురు స్కూల్‌ సిబ్బంది. కాల్పలు జరిపింది అదే స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి కావడం గమనార్హం.

అమెరికా(America)లో తుపాకీ మోతలు మళ్లీ వినిపించాయి. టేనస్సీ స్టేజ్‌ రాజధాని నాష్‌విల్లేలోని ఓ ప్రైవేటు ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ ఘోరం జరిగింది. నాష్‌విల్లే(Nashville)కు చెందిన 28 ఏళ్ల ఆడ్రీ హేల్‌(Audrey Hale) అనే మహిళ జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. చనిపోయినవారిలో తొమ్మిదేళ్లలోపు పిల్లలు ముగ్గురున్నారు. మిగతా ముగ్గురు స్కూల్‌ సిబ్బంది. కాల్పలు జరిపింది అదే స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. ఆమెను పోలీసులు అక్కడిక్కడే కాల్చి చంపేశారు. రెండు రైఫిల్స్‌, ఓ హ్యాండ్‌ గన్‌తో పాఠశాల పక్క డోర్‌ నుంచి లోపలికి వచ్చిన ఆడ్రీ హేల్‌ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. ఎమర్జెన్సీ కాల్‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు పావుగంటలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మిగతా పిల్లలను, స్టాఫ్‌ను బయటకు తీసుకొచ్చారు. కాల్పులు జరిపిన ఆడ్రీ హేల్‌ను అక్కడిక్కడే కాల్చి చంపారు. ఆమెను ట్రాన్స్‌జెండర్‌గా పోలీసులు గుర్తించారు. ఆమెకు ఎలాంటి నేర చరిత్ర లేదని, ఏదో కోపంలో ఇలా చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పక్కా ప్లాన్‌తోనే ఆడ్రీ హేల్‌ కాల్పులకు తెగబడింది. ఒక్క స్కూల్‌ను మాత్రమే ఆమె టార్గెట్‌గా చేసుకోలేదట. ఆమె దగ్గర మరిన్ని ప్రాంతాలకు చెందిన మ్యాప్‌లు దొరికాయట. వాటిల్లో ఈ స్కూల్‌ ఒకటి. ఇక్కడ కాల్పులు జరిపిన తర్వాత మరిన్ని దాడులకు దిగేదేమో అని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఈ దారుణ సంఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయుధ నిషేధ చట్టానికి మద్దతు తెలపాల్సిందిగా ఈ సందర్భంగా రిపబ్లిక్‌లను కోరారు. అమెరికాలో గన్‌కల్చర్‌ బాగా పెరిగింది. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా స్కూల్స్‌నే టార్గెట్‌గా చేసుకుంటున్నారు దుండగులు.

లాస్ట్‌ ఇయర్‌ టెక్సాస్‌ రాష్ట్రంలోని ఉవాల్డేలో దుండగులు జరిపిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు చనిపోయారు. కనెక్టికట్ రాష్ట్రంలో 2012లో తుపాకీ తూటాలకు 26 మంది చనిపోయారు. ఇందులో 20 మంది పిల్లలే ఉండటం విషాదం.

Updated On 28 March 2023 12:23 AM GMT
Ehatv

Ehatv

Next Story