బిహార్ రాష్ట్రం తూర్పు చంపారన్‌లోని మోతీహరిలో మానవత్వాన్ని కించపరిచే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పిప్రా పోలీస్ స్టేషన్‌లోని మఘుదిహ్ గ్రామంలో ఒక యువకుడిని కిడ్నాప్ చేసి బందీ చేశారు. అతడి చేతులు, కాళ్లు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత బలవంతంగా మద్యం తాగించి, చెప్పులతో కొట్టి, తల గుండు కొట్టించి, సగం మీసాలు కత్తిరించారు.
బిహార్ రాష్ట్రం(Bihar) తూర్పు చంపారన్(East Champaran)లోని మోతీహరిలో మానవత్వాన్ని కించపరిచే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పిప్రా పోలీస్ స్టేషన్‌లోని మఘుదిహ్ గ్రామంలో ఒక యువకుడిని కిడ్నాప్(Kidnap) చేసి బందీ చేశారు. అతడి చేతులు, కాళ్లు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత బలవంతంగా మద్యం తాగించి, చెప్పులతో కొట్టి, తల గుండు కొట్టించి, సగం మీసాలు కత్తిరించారు. బాధిత యువకుడు తూర్పు చంపారన్‌లోని కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్(Kalyan Pur Police Station) పరిధిలోని తులసి పట్టి నివాసి. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు(Arrest) చేశారు.
కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్‌పూర్(govindhpur) గ్రామానికి చెందిన బాధితుడి తండ్రి రామానంద్ రాయ్(Ramanand Roy) ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్(FIR) ప్రకారం.. రామానంద్ రాయ్ కుమారుడు ఉజ్వల్ కుమార్(Ujwal Kumar) జూన్ 27 సాయంత్రం మార్కెట్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంతలో 15 నుంచి 20 మంది స్కార్పియోతో వెంబడించి తుపాకీ పెట్టి బెదిరిస్తూ కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతడిని బందీగా పట్టుకుని బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత అతనిపై ఉమ్మి వేశారు. తల గుండు చేసి మీసాలు సగం తీసేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. దీంతో బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు.
అరెస్టయిన వారిలో తూర్పు చంపారన్‌లోని పిప్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని మఘుడిహ్ నివాసి శివమ్‌కుమార్(Shivam Kumar), బంజరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజరియా నివాసి సౌరభ్‌కుమార్(Saurabh Kumar), పశ్చిమ చంపారన్‌లోని బెట్టియా నివాసి దీపక్‌కుమార్(Deepak Kumar)లు ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కంటెష్ కుమార్ మిశ్రా(Kantesh Kumar Mishra) తెలిపారు.
నిందితులను శివమ్ ఫామ్ హౌస్ నుంచి అరెస్టు చేశారు. అక్కడి నుంచి పదునైన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ చీఫ్ సహా ఇతర నిందితుల కోసం సోదాలు నిర్వహిస్తున్నారు. రైడ్ బృందంలో చాకియా డీఎస్పీ సతేంద్ర కుమార్ సింగ్(Sathendra Kumar Singh), ఎస్‌హెచ్‌ఓ సత్కుమార్, ఎస్‌హెచ్‌ఓ సీతా కేవత్, ఎస్‌ఐ జితేంద్ర కుమార్, మోహన్ రాయ్, వివేకానంద్ సింగ్ లు ఉన్నారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన జనం పెద్ద సంఖ్యలో శుక్రవారం మధుదిహ్ గ్రామంలో ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న అనుమానితుల ఇళ్లపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.